‘ కల్కి ‘లో క్యామియో పాత్రలు చేసిన సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే.. ఆ స్టార్ డైరెక్టర్ కూడానా..?!

ప్రభాస్ కల్కి సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్‌, నెగెటీవ్ రోల్‌లో క‌మ‌ల్ హాస‌న్‌ ప్రేక్షకులను మెప్పించనున్నారు. చాలా రోజుల తర్వాత హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహానటి, సీతారామమ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్, హాట్ బ్యూటీ మాళవిక నాయర్ ఈ సినిమాలో నటించార‌ని టాక్‌.. కాగా దుల్కర్, మాళవిక ఏ పాత్రలో నటిస్తున్నారు అనేదానిపై క్లారిటీ రాలేదు.

Team Kalki Drops Shobana's First-Look Poster - Andhrawatch.com

అలాగే ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయిన అలనాటి బ్యూటి శోభన కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే అలనాటి హీరో రాజేంద్రప్రసాద్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక‌ టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి కూడా ఈ సినిమాలో కామియో రోల్ ప్లే చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్త నిజమైతే ప్రేక్షకుల్లో సినిమా పై మరింత హైప్ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. అలాగే అన్నా బెంచ్, శాశ్వత చటర్జీ కూడా ఈ సినిమాల్లో మంచి పాత్రల్లో మెప్పించనున్నారు.

Check out the funny Twitter conversation between RGV and SS Rajamouli

రోబోటిక్ కార్ అయినా బుజ్జి పాత్ర‌కు కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె వాయిస్ కూడా సినిమా మీద అంచనాలను పెంచింది. మరి ఇన్ని కామియో పాత్రలతో.. ఇంత మంది స్టార్ సెల‌బ్రెటీస్ న‌టిస్తున్న ఈ సైన్స్ ఫ్రిక్ష‌న్ డ్రామాపై ప్రేక్ష‌కుల‌లో మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌ద్యంలో సినిమా రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.. ప్రేక్షకులు ఏ రేంజ్‌లో సినిమాలు ఆదరిస్తారో తెలియాలంటే సినిమా రిలీజై.. రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.