అల్లు ఫ్యామిలీలో ప్రత్యేక పూజలు.. ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియా లో.. సినీ వర్గాలలో ఎక్కువగా వైరల్ గా మారింది . ప్రెసెంట్ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీని ట్రోల్ చేసే జనాలు ఎక్కువగా మారిపోయారు. దాని అంతటికి కారణం మనకు తెలిసిందే . ఏపీలో జరిగిన పొలిటికల్ ఇష్యూను ఏకంగా ఇంటి వరకు తెచ్చుకున్నారు ఈ మెగా – అల్లు హీరోస్.. కాగా సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ కారణంగా ఏకంగా అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పుష్ప2 సినిమాను సైతం వాయిదా వేసుకున్నాడు.

ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఏకంగా డిసెంబర్ 6 పోస్ట్ పోన్ అయింది . అయితే ఇది ఇదే కాకుండా అల్లు అర్జున్ కమిట్ అయినా కొన్ని సినిమాలు కూడా క్యాన్సిల్ అయిపోయాయట . దీంతో అల్లు అర్జున్ జాతకంలో ఏదో దోషం ఉంది అంటూ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేయించడానికి నిర్ణయించుకున్నారట . అల్లు ఫ్యామిలీలో త్వరలోనే ప్రత్యేక పూజలతో పాటు హోమాలు కూడా వేయబోతున్నారట .

ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . అల్లు అర్జున్ కూడా ఇలాంటివి నమ్ముతాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది కేవలం తన తల్లి కోసం మాత్రమే చేస్తున్నాడట. మొదట నుండి అల్లు అర్జున్ కి తన తల్లి అంటే మహా మహా ఇష్టం.. బన్నీ అమ్మ మాటను ఎప్పుడు కూడా కాదు అనలేదు. ఆమె నమ్మిన కారణంగానే ఇప్పుడు బన్నీ ఇలా చేయబోతున్నాడట..!!