బాడీ టోన్ గురించి చాలామంది ఎప్పటికప్పుడు మనుషులను హేళన చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో కొందరు డిప్రెషన్ కి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అలా డిప్రెషన్ కి గురై ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం, లేదంటే ఎవరితోనూ కలవకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితినే స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూతురు కూడా ఎదుర్కొందని చెప్పుకొచ్చింది భార్య ట్వింకిల్ ఖన్నా. తాజాగా ఈ విషయాన్ని రచయిత నటి ట్వింకిల్ ఖన్నా వివరిస్తూ తన కూతురు విషయంలోనూ ఇలాంటి సంఘటన ఎదుర్కొన్నట్లు వివరించింది.
నా కూతురు నితారా స్విమ్మింగ్ క్లాసులకు వెళ్ళేది.. కానీ ఒకసారి సడన్గా వెళ్ళనంటూ స్విమింగ్ మానేసింది. అంతేకాదు ఎండలో టాన్ అయిపోయి నల్లగా అయిపోతున్న.. అన్నయ్య లాగా తెల్లగా అవుతా అంటూ ఆమె వివరించింది. నేను ఆశ్చర్యపోయాను. తర్వాత అసలు మ్యాటర్ అర్థమైంది. మా బంధువుల్లో ఒకరు చేసిన తెలివి తక్కువ కామెంట్ వల్ల తను హర్ట్ అయిందని. మీ పాప చాలా క్యూట్ గా ఉంది కానీ.. ఆరవ్ లాగా తెల్లగా లేదు అంటూ ఒక బంధువు వివరించారని.. ఆ మాట విన్న నితారా దానిపై ఆలోచించడం మొదలుపెట్టిందంటూ చెప్పుకొచ్చింది.
రంగు ముఖ్యం కాదు అని చెప్పాలని టంవింకిల్ భావించిందట. అప్పుడు ఫ్రిదాఖలో బయోగ్రఫీని ఆమెకు ఇచ్చి చదవమని చెప్పానంటూ వివరించింది. ఆ బయోగ్రఫీలో మెక్సికాన్ పెయింటర్ మనిషి శరీరం మరియు ఐడెంటిటీ, మరణం, వ్యక్తిత్వం ఇలా చాలా విషయాల గురించి క్లుప్తంగా వివరించాడు. ఆ పుస్తకం చదివాక నా కూతురులో చాలా మార్పు వచ్చిందంటూ చెప్పుకొచ్చింది. తెలుపు అంటే లైట్ కలర్. త్వరగా మురికి పడుతుంది. నలుపు అంటే డార్క్ కలర్ అంత త్వరగా మాసిపోదు అని ఆమెకు అర్థమైంది అంటూ వివరించింది. ప్రజెంట్ అమ్మడు చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారడంతో ఈ వ్యాఖ్యలు చేసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె చాలా మంచి పని చేసిందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.