ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని రెబెల్ హీరోగా పాపులారిటీ దక్కించుకొని ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన మూవీనే ఈ కల్కి . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా క్రేజీ క్రేజీ రికార్డులను సైతం నెలకొల్పింది .
అయితే ఈ సినిమా నిర్మాత స్వప్న దత్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అశ్వినీ దత్ కుమార్తెలు స్వప్న దత్- ప్రియాంక దత్..ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు . సినిమా సూపర్ డూపర్ హిట్అయి క్రేజీ రికార్డ్స్ నెలకొల్పుతుంది. ఈ క్రమంలోనే ఆమె సెన్సేషనల్ పోస్ట్ షేర్ చేయడం గమనార్హం.
ఆమె ఆ పోస్టులో రాసుకోస్తూ..” ప్రతి ఒక్కరూ కాల్ చేసి ఒకటే మాట అడుగుతున్నారు .. సినిమా రికార్డ్స్ బీట్ చేశామా..? లేదా..? ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసాము..? ఎంత కలెక్షన్స్ సాధించాము ..? అని అసలు నాకు అర్థం కావడం లేదు ..కొన్నిసార్లు అలాంటివి విన్నప్పుడు నవ్వొస్తుంది.. ఎవ్వరూ కూడా రికార్డ్స్ క్రియేట్ చేయడానికి .. రికార్డ్స్ బద్దలు కొట్టడానికి సినిమాను తెరకెక్కించారు.. సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్.. ఫ్యాషన్ తోనే అలాంటి మూవీస్ను తెరకెక్కిస్తారు “అంటూ రాసుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ బాగా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు కల్కి సినిమా మరింత స్థాయిలో జనాలకు రీచ్ అవ్వడానికి కల్కి టీం ఇంకా ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉండడం గమనార్హం..!!