సుకుమార్ ‘ పుష్ప ‘ సీక్వెల్ తర్వాత మరోసారి ఆ సినిమా సీక్వెల్ తీయనున్నాడా.. మ్యాటర్ ఏంటంటే..?!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజ‌ర్‌ సినిమాలో నటిస్తూ బిజీగా గ‌డుతున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని ఎలాగైనా బాక్స్ ఆఫీసులో బ్లాస్ట్‌ చేయాలని కసితో ఉన్నాడు చరణ్ తేజ. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నారు. అలాగే ఆర్‌సి17 రన్నింగ్ టైటిల్ తో మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Happy Birthday Sukumar: Notable Movies by the Telugu Filmmaker Behind ' Pushpa' - News18

ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో రంగస్థలం సినిమా వచ్చి.. నాన్ థియేట్రిక‌ల్ రికార్డ్స్ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు రంగస్థలంకు సీక్వెల్ గా మరో సినిమా చేయాలనే ప్లాన్‌లో వీళ్ళిద్దరూ ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు సీక్వెల్ సినిమాలు ట్రెండ్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాపై మంచి బజ్ కూడా ఏర్పడింది. ఇప్పటికే సుకుమార్ పుష్ప2 సినిమాతో పుష్ప సీక్వెల్ తీస్తున్నాడు. దీంతో పట్టే మరోసారి రంగస్థలం సీక్వెల్‌ను కూడా తీయాలని స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నాడట సుకుమార్. మొత్తానికి సుకుమార్ వరుసగా సీక్వెల్ ల‌పై దృష్టిసారించ్చినట్లు సమాచారం.

Ram Charan Upcoming Movie Project: 'RRR' star Ram Charan to team up with  'Pushpa' director Sukumar again for a pan-India project | - Times of India

దీంతో సుకూ అభిమానులతో పాటు.. తెలుగు ఆడియన్స్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రంగస్థలం సినిమా టాలీవుడ్ ఆడియన్స్ కు ఆరెంజ్ లో హై ఫీల్ ఇచ్చింది. ఇక‌ ఈ సినిమాతో చిట్టిబాబు పాత్ర మరోసారి హైలెట్ కాబోతుందని.. ఆ పాత్రను మరోసారి చూడబోతున్నందుకు ఆనందంగా ఉందంటూ రామ్ చరణ్ అభిమానులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్ ఈ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకుంటాడో లేదో వేచి చూడాలి. ఒకవేళ ఈ మూడు సినిమాలు వరుసగా సక్సెస్ లు సాధిస్తే. చరణ్ నెంబర్ వన్ పాన్ ఇండియన్ హీరోగా ఎదుగుతాడు అనడంలో సందేహం లేదు.