కెరీర్ లోనే ఫర్ ద ఫస్ట్ టైం .. ఎన్టీఆర్ చేత ఆ పని చేయించబోతున్న ప్రశాంత్ నీల్..!?

ఈ ఒక్క న్యూస్ నందమూరి ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో పూనకాలు తెప్పిస్తుంది . జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న సరే అది చాలా చాలా పకడ్బందీగా పక్కా ప్లాన్ తో తీసుకుంటాడు . ఆ విషయం అందరికీ తెలిసిందే . కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఎప్పుడో ఈ సినిమా సెట్స్ పైకి రావాల్సింది. కానీ కొన్ని కారణాల చేత ఆగిపోయింది . రీసెంట్గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఒక అఫీషియల్ అప్డేట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.

ఈ సినిమా ఆగస్టులో సెట్స్ పైకి రాబోతుంది అంటూ చెప్పుకు వచ్చారు . అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ సెన్సేషనల్ గా మారింది. ఈ సినిమా ఏకంగా 15 దేశాల్లో షూటింగ్ చేయబోతున్నారట . అంతేకాదు ఒక్కొక్క పాటను ఒక్కొక్క దేశంలో చిత్రీకరించబోతున్నారట . నిజానికి ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరియర్ లో ఎప్పుడూ కూడా ఇలా ఒక సినిమా 15 దేశాలలో షూటింగ్ చేసిన దాఖలాలు లేవు.

అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఫర్ ద ఫస్ట్ టైం .. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది రష్మిక మందన్నా. దీంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు నందమూరి అభిమానులు. ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు ఈ సినిమా కోసం చాలా స్టైలిష్ లుక్ ను క్రియేట్ చేయబోతున్నాడట ప్రశాంత్ నీల్. ఇప్పటివరకు మనం ఎన్టీఆర్ ని కని విని ఎరుగని చూడని లుక్ లో చూడబోతున్నాం అన్న వార్త కూడా ట్రెండ్ అవుతుంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు..!!