రామ్ చరణ్ నటించిన ఆ సినిమా సురేఖ ఏకంగా 100 సార్లు చూసిందా..? ఎందుకు అంత స్పెషల్ అంటే..!?

ప్రతి తల్లికి తన బిడ్డ ఎంతో స్పెషల్ .. తన పెట్టే ఏదైనా కొత్త పని చేసిన గర్వించే పని చేసిన ఆ తల్లి మురిసిపోతుంది .. అది అందరికీ తెలిసిందే. అలాంటిదే సురేఖ కూడా మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. సురేఖ కొడుకు రామ్ చరణ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా చిరుత . ఈ సినిమాతో చరిత్ర తిరగరాసేసాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ గా మారుతాడు అని ప్రూవ్ చేశాడు .

ఈ సినిమాని సురేఖ ఏకంగా 100 సార్లకు పైగానే చూసిందట . దానికి కారణం కొడుకు ఫస్ట్ సినిమా కావడం . అప్పటివరకు తన కొడుకు ఇంట్లో ఎలా ఉంటాడు అనే విషయం మాత్రమే సురేఖకు తెలుసు . ఈ సినిమాలో నటించిన తర్వాత చరణ్ కి కోట్లాదిమంది తల్లులు చూసి ఎంకరేజ్ చేశారు. తన కొడుకు నటనను పదేపదే టీవీలో చూస్తూ మురిసిపోయేదట. సురేఖ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది .

దీనికి సంబంధించిన వార్తను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు . ప్రజెంట్ రాంచరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.. రామ్ చరణ్ ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది . రెండవ హీరోయిన్గా మలయాళీ బ్యూటీ మమిత బైజు సెలెక్ట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!