సాయి ధరంతేజ్ ఆ మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ చేసుకున్నాడా.. నటించి ఉంటే రేంజే మారిపోయేదిగా..?!

మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటులుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే చాలా తక్కువ మంది మాత్రమే స్టార్ సెలబ్రిటీలుగా క్రెజ్‌ను సంపాదించుకున్నారు. అలా క్రేజ్‌ సంపాదించుకున్న వారిలో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఒకడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌, ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోను ఎన్ని సక్సెస్‌లు ఉన్నాయో అదే రేంజ్ లో ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా మంచి కథ‌లని నేర్చుకుంటూ సక్సెస్ అవ్వాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఇలా సాయి ధరంతేజ్ కొన్ని సందర్భాల్లో అసలు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.

Shatamanam Bhavati (2017) - IMDb

అయితే ఇండస్ట్రీలో చిన్న నుంచి పెద్ద స్టార్ హీరోల వరకు ఎలాంటి వారైనా కొన్ని సందర్భాల్లో తమకు వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా సాయి ధరంతేజ్ ఇప్పటివరకు మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేసాడట. మూడు సినిమాలను నటించి ఉంటే అతని రేంజ్ వేరే లెవెల్ లో ఉండేది అనడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ సాయి ధరంతేజ్ మిస్ చేసుకున్న మూడు సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. దిల్ రాజు ప్రొడ్యూసర్గా తెర‌కెక్కిన శతమానం భవతి. ఇందులో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా అప్పట్లో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. మొదట ఈ మూవీని నిర్మాత సాయిధరమ్ తేజ్‌తో తెర‌కెక్కించాలని భావించాడట.

Kerintha - Wikipedia

సంక్రాంతికి విడుదల చేస్తామని దిల్ రాజు చెప్పడంతో.. అదే సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 కూడా రిలీజ్ అవుతుంది ఆ సినిమాకు పోటీగా వెళ్లే ఉద్దేశం లేక శతమానంభవతి సినిమా రిజెక్ట్ చేశాడట సాయి ధరమ్ తేజ్. ఇక సాఫ్ట్ హీరో క్యారెక్టర్ లో కేరింత సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథను కూడా మొదట సాయి ధరంతేజ్‌కు వినిపించారట మేకర్స్. ఈ సున్నితమైన పాత్రలో తాను నటించినా సెట్ కానని తేజ్‌ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే.

RX 100 2 Days Collections : Excellent

కార్తికేయ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించిన మూవీ ఆర్ఎక్స్ 100.. ఎలాంటి బ్లాక్ బ‌స్టర్స్ అందుకుందో తెలిసింది. అప్పట్లో యూత్ లో ఈ సినిమా వైబ్రేషన్ గా నిలిచింది. ఐతే ఈ సినిమా అవకాశం మొదటి స్థాయి ధరమ్ తేజ్‌కి వెళ్ళిందట. కానీ అలాంటి ఒక రఫ్ రోల్ తాను చేయాలేన‌ని సినిమాలు వదులుకున్నాడట. ఇలా తాను నటించాల్సిన మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను సాయి ధరంతేజ్ ఏవో కారణాలతో రిజెక్ట్ చేశాడు. ఇప్పటికీ ఆ మూడు సినిమాల్లోనూ నటించి ఉంటే తేజ్ మరింత స్టార్ డమ్ సంపాదించుకునేవాడు.