తాను ఒకటి అనుకుంటే దైవం మరోకటి తలచింది అన్నట్లు.. పాపం సుకుమార్ – బన్నీ ఎంతో ఇష్టంగా చాలా చాలా కష్టపడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న పుష్ప 2 సినిమా వాయిదా పడింది . గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి . సినిమా వాయిదా పడింది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది . కానీ అభిమానులు మాత్రం నమ్మలేదు .
అంత పెద్ద స్టార్స్ ఎందుకు సినిమాని పోస్ట్ పోన్ చేస్తారు అంటూ మాట్లాడుకున్నారు. ఫైనల్లి అనుకున్నదే అయింది . సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా రష్మిక మందన్నా.. హీరోయిన్గా నటిస్తున్న పుష్ప2 సినిమా వాయిదా పడింది . ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర బృందం . కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా వేశామంటూ అఫిషియల్ గా ప్రకటించారు మేకర్స్.
డబల్ పవర్ ప్యాకెట్ పర్ఫామెన్స్ తో మీ ముందుకు వస్తామంటూ చెప్పుకొచ్చారు మూవీ టీం. అయితే ఈ సినిమా వాయిదా పడడానికి మెయిన్ రీజన్ సుకుమార్ అంటూ ప్రచారం జరుగుతుంది . సోషల్ మీడియాలో బన్నీపై జరిగే ట్రోలింగ్ చూసిన ఆయన సినిమా కలెక్షన్స్ ఎక్కడ దెబ్బ పడిపోతుందో అన్న భయంతోనే సినిమాని పోస్ట్ పోన్ చేశారట . అసలు సినిమాని పోస్ట్ పోన్ చేయాలి అన్న ఆలోచన ప్రతిపాదన తీసుకొచ్చింది కూడా సుకుమార్ నే అంటూ ప్రచారం జరుగుతుంది..!!