“ఆ హీరోయిన్ ని ఢీ కొట్టే ఆడదే లేదు”.. బాలయ్య నోట నుండి ఊహించని మాట..!

బాలయ్య .. ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడినా అది సెన్సేషన్ గానే మారుతుంది . సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాలయ్య ఏ విధంగా ట్రోలింగ్కి గురయ్యాడో కూడా మనం చూసాం. మరీ ముఖ్యంగా విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన అంజలీతో ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . అఫ్ కోర్స్ అదంతా సరదాగానే జరిగినప్పటికీ పలువురు మాత్రం వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్ చేశారు .

ఓ ఇంటర్వ్యూలో బాలయ్య చేసిన కామెంట్స్ మరొకసారి నెట్టింత ట్రెండ్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నందమూరి నటసింహం బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఆదిత్య 369 . ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ టూ కెవ్వు కేక . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య ఈ సినిమాలో వన్ ఆఫ్ ద కీలకపాత్రలో నటించిన సిల్క్ స్మిత పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

“ఇండస్ట్రీలో ఆ విషయంలో సిల్క్ స్మితను ఢీకొట్టే ఆడదే లేదు అంటూ చెప్పుకొచ్చారు”. ” అప్పట్లో టాప్ హీరోయిన్స్ గా ఉన్న వారందరూ కూడా సిల్క్ స్మిత మేకప్ గురించి ఎక్కువగా చర్చించుకునే వారట.. ఆమె ఎటువంటి మేకప్ ప్రొడక్ట్స్ వాడుతుంది ఆమె ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరిస్తుంది .. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటి అంటూ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వారట . ఇదే విషయంని ఆయన ఇంటర్వ్యూలో చెప్పి అభిమానులకి షాక్ ఇచ్చాడు. మరొకసారి ఆ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!