ఇండస్ట్రీలో అలా చేస్తున్న ఏకైక హీరో బాలయ్యనే.. గట్స్ ఉన్న మగాడి క్వాలిటీస్ ఇవే..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టార్స్ రెమ్యూనరేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒక్కొక్క సినిమాకి ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో కూడా మనకు తెలిసిందే . సినిమా సినిమాకి పెంచుకుంటూ పోతున్నారు తప్పిస్తే ఎక్కడ తగ్గించడం లేదు. అయితే బయట మార్కెట్ లో ఉండే వాల్యూ ప్రకారం అలా చార్జ్ చేస్తున్నాడు . అయితే ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ అన్న పదం ఆలోచించకుండా కేవలం కధా..దా కంటెంట్ నచ్చిన సినిమాలను ఓకే చేసే హీరో ఒకే ఒక్కడు ఉన్నాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

నందమూరి ఫ్యాన్స్ ఆ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహం గా పోపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఒక్కడే రెమ్యూనరేషన్ అన్న పదాన్ని ఆలోచించకుండా కథ బాగుంది.. జనాలకి నచ్చుతుంది డైరెక్టర్లు లాభపడతారు మనము నటించాలి అనే విధంగా ఆలోచిస్తాడు అని.. మిగతా హీరోలు అందరూ కూడా కేవలం సినిమాలకు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు . వాళ్ళ పాత సినిమాలు ప్లాప్ అయినా సరే నెక్స్ట్ సినిమాలకి హై రేంజ్ చేస్తూ మేకర్స్ కి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల బావినీర్లు తాపిస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు .

వీర సిమ్హా రెడ్డి కి బాలయ్య 30 కోట్లు మాత్రమే తీసుకున్నారట. భగవంత్ కేసరికి కేవలం 40 కోట్లు మాత్రమే తీసుకున్నారట. ఇప్పుడు బాలయ్య -బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి కూడా అంతే 50 తీసుకుంటున్నారు. అయితే మిగతా హీరోలు మాత్రమే ఒక్కొక్క సినిమాకి 70 – 80 – 100- 150 కోట్లు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు నందమూరి అభిమానులు బాగా సీరియస్ గా తీసుకొని మరీ ట్రెండ్ చేస్తున్నారు..!!