నేడు హీరోయిన్ అంజలి పుట్టినరోజు .. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ ఫ్రెండ్స్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఆమెకు స్పెషల్గా విష్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా హీరోయిన్ అంజలి అంటే తెలుగు జనాలకు ఎక్కువ ఇష్టం ..తెలుగు హీరోయిన్ కాబట్టి అనుకోవచ్చు.. మరి కొంత రీజన్ అయితే మాత్రం అంజలి తనదైన స్టైల్ లో నటిస్తూ రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడుతూ.. నేటి కాలం జనరేషన్ అమ్మాయి ఎలా ఉండాలో ఆ రేంజ్ లో ఉంటుంది . ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది అంజలి .
కాగా తెలుగు అమ్మాయి అయినప్పటికీ తెలుగులో కన్నా ముందు కోలీవుడ్ లోనే బాగా పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంది . అక్కడ వచ్చిన క్రేజ్ తో తెలుగులో అవకాశాలు దక్కించుకుంది . తెలుగులో ఆమె కొట్టిన మొట్టమొదటి హిట్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని చెప్పాలి . ఈ సినిమాలో సీత క్యారెక్టర్ లో చించిపడేసింది.. ఇప్పటికీ అంజలీని సీత అంటూ పిలిచే జనాలు ఉన్నారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు . రీసెంట్గా సోషల్ మీడియాలో అంజలికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.
హీరోయిన్ అంజలి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె చేసిన పని మరి ఏ హీరోయిన్ చేయలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . హీరోయిన్ అంజలి చాలా చాలా డేరింగ్ గర్ల్. ఈ పాత్ర నాకు నచ్చదు అంటే వెంటనే ఆ పాత్ర నచ్చదు అని చెప్పేస్తుంది ..చేయను అంటూ తగేసి క్లారిటీ ఇస్తుంది . కొందరు హీరోయిన్స్ లా రెమ్యూనరేషన్ కోసం ఇష్టం లేని పాత్రలు మాత్రం చేయదు . ఆ విషయంలో అంజలి ది బెస్ట్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్ . ప్రెసెంట్ ఆమె చేతిలో మంచి మంచి ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులలో గేమ్ చేంజర్ కూడా ఉండడం గమనార్హం. ఈ సినిమా హిట్ అయితే అంజలి లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుందో కూడా మనకు తెలుసు..!!