వావ్: వాట్సాప్ లో కొత్త ఫీచర్..ఇక వాళ్లకి పండగే పండగ..!

మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి సోషల్ మీడియాలో యాప్స్ కొత్త కొత్తవి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్ని యాప్స్ వచ్చిన జనాలు కామన్ గా వాడేది మాత్రం వాట్సాప్ . ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో ఈ వాట్సప్ అందుబాటులో ఉంటుంది . చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఈ వాట్స్అప్ బాగా వాడేస్తూ ఉంటారు . ఇప్పుడు వాట్సాప్ లేని ఫోన్ ఉందా..? అసలుకి అలాంటి ఫోనే లేదు . ప్రతి ఒక్కరికి వాట్సప్ అకౌంట్ ఉంది . వాట్స్అప్ గ్రూప్స్ ఉన్నాయి . ఏదైనా సెకండ్స్ లో షేర్ చేసేయగలరు .

వాట్సాప్ లో రోజురోజుకీ ఒక ఫీచర్ కి మించి మరొక ఫీచర్ వస్తూనే ఉంటుంది . తాజాగా వాట్స్అప్ కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. వాట్సప్ మార్కెట్లోకి అడుగుపెట్టిన రోజు నుంచి కొత్త కొత్తగా అప్డేట్ అవుతూనే ఉంది . ఈ యాప్ ప్రజలు ఉపయోగించడానికి గల కారణాలు కూడా అదే కొత్త కొత్త ఫీచర్స్ ని యాడ్ చేస్తూ ఉంటారు . తాజాగా కొత్త ఫీచర్ ఆడ్ అయింది. మల్టిపుల్ అకౌంట్ సపోర్ట్ .. మల్టీ డివైస్ సపోర్ట్ . వీటిలో మల్టీ డివైస్ సపోర్ట్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..!!

మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్ను ఉపయోగించుకొని మన వాట్సప్ ఖాతాను నాలుగు డివైస్ లకి అంటే నాలుగు పరికరాలకు లింక్ చేసుకోవచ్చు అన్నమాట. కంపానియన్ మోడ్ర్ తో ఇది సాధ్యమవుతుంది . ఇంతకుముందు రెండు వేరువేరు ఫోన్లో వాట్స్అప్ అప్లికేషన్ ఉపయోగించాలి అనుకుంటే రెండు వేరువేరు నెంబర్లు తీసుకోవాలనే నిబంధన ఉండేది . అయితే 2024 నుంచి అది మారిపోయింది. కొత్త ఫీచర్ ద్వారా వాట్స్అప్ ఖాతాను వివిధ ఫోన్లో ఉపయోగించవచ్చు.. దీన్నే కంపెనీ పిలుస్తారు .. మీ ప్రాథమిక ఫోన్ ఉపయోగించి నాలుగు వేరువేరు పరికరాలను లింక్ చేయొచ్చు.. అలా చేయాలి అంటే ప్రతి 14 రోజులకు మీ ఫోన్ లాగిన్ అవుతూ ఉండాలి.. మీరు నాలుగు పరికరాలను ఏవైనా ఎంచుకోవచ్చు .. నాలుగు వేరు వేరు కంప్యూటర్లు లేదా నాలుగు వేరువేరు ఫోన్లు కూడా ఎంపిక చేసుకోవచ్చు.. అయితే ఫోన్ లింక్ చేసే విధానాలు ఒకదానికి మరొకటి విభిన్నంగా ఉంటాయి..!!