తెలంగాణ సీఎంను కలిసిన బాలకృష్ణ.. కారణం ఏంటంటే..?!

నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం టాలీవుడ్‌ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ హిట్లతో భారీ పాపులారిటీ దక్కించుకున్న బాలయ్య.. యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలో నటిస్తూ తన సత్తా చాటుతున్నాడు. మరోపక్క రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నాడు. ఇక తాజాగా బాలకృష్ణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం.. నెటింట చ‌ర్చ‌నీయాంవంగా మారింది. అయితే బాలయ్య.. రేవంత్ రెడ్డిని కలవడానికి గల కారణం ఏంటో.. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.

Tollywood impasse continues as Rs 600 crore stuck - BusinessToday

మే 26 హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని,, బాలకృష్ణ క‌లిశాడు. మర్యాదపూర్వకంగా బాలయ్యను పలకరించిన రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్‌లో ఆయ‌న ఇంట్లో కొద్దిసేపు బాల‌య్య‌తో కలిసి మాట్లాడారు. ఈ క్ర‌మంలో సినీ రంగానికి సంబంధించిన ఎన్నో ఆశ‌క్తిక‌ర అంశాల‌ను సీఎం దృష్టికి బాల‌య్య తీసుకువెళ్లినట్లు సమాచారం. అలాగే మంత్రి శ్రీధర్ బాబుతో.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కలిసి ఎన్నో విషయాల గురించి చర్చించాడు.

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే చివ‌రిగా భగవంత్ కేసరితో మూడోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం దర్శకుడు కొల్లి బాబి డైరెక్షన్ లో తన 109వ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాను తార‌క్ దేవర‌కు పోటీగా బాల‌య్య రిలీజ్ చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్‌.. ప్రేక్షకులను వేరే లెవెల్లో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో బాలయ్య మరోసారి హిట్ కొట్టడం ఖాయమంటూ తమ అభిమానులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.