ఓరోరి .. విశ్వక్సేన్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా ఆ హీరో చేయాల్సిందా..? ఎలా మిస్ అయ్యాడంటే..?

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ..టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విశ్వక్సేన్ తాజాగా నటించిన సినిమా. ఎప్పుడో షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది.. కానీ కొన్ని కారణాల చేత ఆగుతూ ఆగుతూ వచ్చి ఫైనల్లీ కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఈ సినిమా ఎలాంటి హిట్ టాక్ అందుకుందో మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఊర నాటు మాస్ లుక్ లో విశ్వక్సేన్ అదరగొట్టేసాడు .

అంతేనా విశ్వక్సేన్ ఈ సినిమాలో వాడిన డైలాగ్స్ బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో ఉన్నాయి . బీప్ సౌండ్ వేయాల్సింది జస్ట్ మిస్ . అలాంటి బోల్డ్ డైలాగ్స్ ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి . కాగా ఈ సినిమా చూసిన తర్వాత అభిమానులు ఒకే ఒక్క విషయాన్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు . ఈ క్యారెక్టర్ లో విశ్వక్సేన్ బాగా నటించాడు. కానీ విశ్వక్సేను కాకుండా ఈ స్టోరీ జూనియర్ ఎన్టీఆర్కి పడి ఉంటే మాత్రం కెవ్వు కేక రచ్చ రంబోలా అదిరిపోయేది అంటూ చెప్పుకొస్తున్నారు.

ఇలాంటి ఓ పవర్ఫుల్ మాస్ రోల్లో ఎన్టీఆర్ నటించి ఉంటే మాత్రం దేవరకు మించిన హిట్ అయి ఉండేది అంటూ చెప్పుకొస్తున్నారు . నందమూరి ఫ్యాన్స్ ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . విశ్వక్సేన్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . విశ్వక్సేన్ కి బాగా సపోర్ట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రసెంట్ ఆయన దేవర సినిమా షూట్ లో బిజీ గా ఉన్నాడు..!!