బాలయ్యకు భార్యగా స్టార్ హీరోయిన్ ..మాస్ డైరెక్టర్ ఊర మాస్ నిర్ణయం అదిరిపోయిందిగా..!

ఈ మధ్యకాలంలో యంగ్ హీరోస్ కి జోడీలుగా కాదు సీనియర్ హీరోస్ కి జోడిగా నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పలువురు ముద్దుగుమ్మలు . ఆశ్చర్యం ఏంటంటే యంగ్ హీరోయిన్స్ కూడా సీనియర్ హీరోస్తో జతకట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే సీనియర్ హీరోలు అందరు యంగ్ హీరోయిన్స్ తో అదే విధంగా క్రేజ్ ఉన్న టాప్ హీరోయిన్స్ తోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

ప్రజెంట్ నందమూరి బాలయ్య బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు బాలయ్య. అయితే ఈ సినిమా షూట్ కంప్లీట్ అయిపోగానే అఖండ 2 ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రాబోతుంది . ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎలాంటి హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో కూడా మనకు తెలుసు .

కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో అఖండ 2 కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది . అఖండ సినిమాలో బాలయ్యకు జోడిగా నటించింది ప్రగ్యా జైశ్వాల్. అయితే అఖండ 2 సినిమాలో మాత్రం బాలయ్యకు జోడిగా భూమిక నటించబోతుందట . బోయపాటి శ్రీనునే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఊహించని విధంగా కథను మలుపు తిప్పుతూ భూమిక క్యారెక్టర్ ను ఇంటర్వ్యూ చేయబోతున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది వైరల్ గా కూడా మారింది..!!