ఆ టూ నాటి రొమాంటిక్ హీరోతో గురూజి సినిమా.. ఊహించని షాక్ ఇచ్చిన త్రివిక్రమ్..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు చెప్పలేం.. అనడానికి ఇది మరొక ఎగ్జాంపుల్ . నిన్నటి వరకు చాలా ట్రెడిషనల్ హీరోలతోనే సినిమాలను తెరకెక్కించే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సడన్గా రూటు మార్చేసుకున్నాడు . ఎలా అంటే ట్రెండీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోతో సినిమా తీయడానికి సినిమా తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు రొమాంటిక్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డతో సినిమా తీయబోతున్నాడట .

ప్రజెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . డిజె టిల్లు సినిమాలో సిద్దు జొన్నలగడ్డ ఎంత రొమాంటిక్గా నటించాడో మనకు తెలిసిందే. త్వరలోనే టిల్లు క్యూబ్ లో కూడా నటించబోతున్నాడు . అలాంటి సిద్ద జొన్నలగడ్డతో సూపర్ హిట్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సినిమా అంటే కచ్చితంగా జనాలు షాక్ అవుతారు . ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తన సినిమాలో రొమాన్స్ ని చాలా హెల్తీగా చూపిస్తారు .

వల్గర్ సీన్స్ చూయించడు. అయితే సిద్దు జొన్నల గడ్డ లాంటి హీరోని ఎలా హ్యాండిల్ చేస్తాడా ..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . ఊహించని హీరోతో త్రివిక్రమ్ సినిమాకి కమిట్ అయ్యేసరికి ఫాన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు . చూద్దాం మరి కాంబో ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో..? ప్రసెంట్ అయితే ఈ వార్త సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది..!!