టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ ఎస్ ఎం బి 29 షూటింగ్ కోసం బిజీబిజీగా అన్నాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ తన లుక్ బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఆయన కొడుకు గౌతమ్ గ్రాడ్యుయేషన్ సందర్భంగా ఫారణ్ వెళ్లాడు మహేష్. ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ తన ఇన్స్టా వేదికగా కొడుకు గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకున్నాడు. నా హృదయం గర్వంతో పొంగిపోతుంది గౌతం. నిను గ్రాడ్యుయేట్ గా చూస్తుంటే ఆనందంగా ఉంది. ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినందుకు నా అభినందనలంటూ వివరించాడు.
ఇక నీ కెరీర్ లో మరో కొత్త అధ్యయనం మొదలుకానుంది. ఆ అధ్యయనం నువ్వే రాయాల్సి ఉంటుంది. ఇకపై నువ్వు మరింతగా ప్రకాశిస్తామని నమ్ముతున్నా.. నీ డ్రీమ్స్ సాధ్యం చేసుకునేందుకు ముందడుగు వేయాలని భావిస్తున్నా.. నీపై ఎప్పుడూ మా ప్రేమ అలానే ఉంటుంది. ఈ రోజు నిన్ను చూసి తండ్రిగా ఎంతో గర్విస్తున్న అంటూ రాసుకొచ్చాడు. అలాగే కొడుకుతో దిగిన ఫోటోలు షేర్ చేశాడు మహేష్. ఇక దీనికి నమ్రత స్పందిస్తూ మాటల్లేవ్.. కేవలం ప్రేమ మాత్రమే అంటూ ట్యాగ్ చేసింది. అలానే.. నా ప్రియమైన జిజి మీరు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయనం మొదలుకానున్న క్రమంలో నేను మీ గురించి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటూ వివరించింది.
View this post on Instagram
ఇది మీరు తెలుసుకోవాలని భావిస్తున్నా.. నీపై నువ్వు నిజాయితీగా ఉండి.. నీ ఫ్యాషన్ ఫాలో అవ్వు.. కలలను సాకారం చేసుకుంటావని భావిస్తున్నా.. నిన్ను నేను ఇంతగా నమ్ముతున్నాను అంతకంటే ఎక్కువగా నిన్ను నువ్వు నమ్ము.. జీవితం మిమ్మల్ని ఎట్టు తీసుకువెళ్లిన మీకు ఎల్లప్పుడూ మా ప్రేమ సపోర్ట్ గా ఉంటుందని గుర్తుంచుకోండి.. మీ బిగ్ డే విషెస్ తెలియజేస్తున్న. ఈ వరల్డ్ నీదే.. నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నా అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో అది చూసి ఫ్యాన్స్ గౌతం కు విషెస్ తెలియజేస్తున్నారు.