కొన్ని కొన్ని సార్లు మల్టీ స్టారర్ సినిమాలే కాదు .. మల్టీస్టారర్ హీరోయిన్ సినిమాలు కూడా చాలా చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి. గతంలో ఎన్నో సినిమాలు అలా వచ్చాయి. అయితే ఇప్పుడు డైరెక్టర్ లు అలాంటి సాహసం ఎక్కువ చేయరు . ఒకప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు . ఇప్పుడు అలాంటి సినిమాలు తెరకెక్కిస్తే ఖచ్చితంగా మేకర్స్ నష్టాలు ఎదుర్కోవడం పక్క. అయితే.. ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ మాత్రం ఉండేలా డైరెక్టర్స్ కొన్ని సినిమాలను తెరకెక్కించారు .
ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న అన్ని సినిమాలలో డ్యూయల్ హీరోయిన్స్ ఎక్కువగా ఉంటారు . కాగా రష్మిక మందన్నా.. సమంత ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోవాల్సిన ఒక సినిమా మిస్సైంది . దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు మజిలీ . టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా నాగచైతన్య హీరోగా దివ్యాంక కౌశిక్ మరొక హీరోయిన్గా నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .
అయితే ఈ సినిమాలో మొదటగా దివ్యాంక పాత్ర కోసం రష్మిక మందన్నాను అనుకున్నారట మేకర్స్ . కానీ ఆమె కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగా రిజెక్ట్ చేసిందట . ఒకవేళ ఆ టైంలో కాల్ షీట్స్ అడ్జస్ట్ అయి ఉంటే కచ్చితంగా రష్మిక ఈ సినిమా చేస్తుంటే సినిమా మరో లెవెల్ లో ఉండేది అంటున్నారు అభిమానులు . అప్పుడు సమంత – రష్మికల మధ్య ఘాటు బోల్డ్ డైలాగ్స్ కూడా పెట్టి సినిమా క్లైమాక్స్ ని వేరే విధంగా మలుపు తిప్పుండొచ్చు శివనిర్వాణ అంటూ జనాలే డైరెక్టర్లుగా మారిపోతున్నారు. ప్రెసెంట్ రష్మిక మందన్నా.. పలు సినిమాలతో బిజీగా ఉంటే .. నాగచైతన్య తండేల్ సినిమాలో బిజీగా ఉన్నాడు . సమంత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది..!