మహేశ్-రాజమౌళి సినిమాలో ఆ సూపర్ స్టార్ నటుడు..ఫోటోతో హింట్ ఇచ్చిన జక్కన్న..!!

ఒక్క అప్డేట్ రాకపోయినా సరే సోషల్ మీడియాలో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసుకున్న మూవీ మహేష్ – రాజమౌళి కాంబోలో తెరకెక్కే సినిమా, ఈ సినిమా త్వరలోనే పూజా కార్యక్రమాలు జరుపుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఈ సినిమాలో నటించే నటీనటుల డీటెయిల్స్ ఇవే అంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి . కాగా తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో మెరబోతున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ నటుడు అన్న విషయం ఇప్పుడు సినిమాకి మరింత హై బజ్ క్రియేట్ చేసింది .

ఆది పురుష సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ తో మెప్పించిన దేవ్ దత్త.. ఈ సినిమాలో కీలకపాత్రలో మెప్పించబోతున్నాడట . రాజమౌళిని ఆయన కలిసిన పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట లీకై బయటకు రావడంతో అసలు విషయం లీక్ అయిపోయింది. మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కే సినిమాలో దేవ్ దత్త ఓ ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి .

ఆది పురుష్ సినిమాలో దేవ్ దత్త హనుమంతుడిగా నటించిన విషయం మనకు బాగా తెలుసు. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు దేవదత్త . ఇప్పుడు రాజమౌళిని ఆయన కలిసిన పిక్చర్స్ బయటకు రావడంతో మహేష్ బాబు సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నాడు అన్న ప్రచారం ఊపొందుకుంది. అయితే ఇది కేవలం రూమర్ నా..? లేకపోతే నిజమేనా తెలియాలి అంటే అఫీషియల్ అప్డేట్ వచ్చేవరకు ఆగాల్సిందే . ఈ వార్త మాత్రం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది..!!