ఆ కమెడియన్ పేరును టాటూ గా వేయించుకున్న ఆనంద్ దేవరకొండ.. షాక్ లో ఫ్యాన్స్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. ఇక చివరిగా బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఆనంద్.. ఉదయ్ శెట్టి కాంబినేషన్లో గం గం గణేశా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో నయన్ సారిక, ప్రగతి శ్రీవత్సవ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. అయితే మే 31న థియేటర్స్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్‌ ప్రమోషన్ కార్యక్రమంలో ఫుల్ బిజీగా గ‌డుతున్నారు.

Anand Deverakonda Gam Gam Ganesha First Look | cinejosh.com

ఈ నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ సుమా అడ్డా షోలో ఇమ్మానుయేల్‌తో క‌లిసి పాల్గొని సంద‌డి చేశాడు. వీరంతా బేబీ స్ఫూఫ్ చేసి ఆడియన్స్ కు కామెడీ ట్రీట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇమ్మానియేల్.. నా ఫ్రెండ్ ఆనంద్ నా పేరును టాటూ కూడా వేయించుకున్నాడు అంటూ షాక్ ఇచ్చాడు. దీంతో సుమ ఇలాంటి ఫ్రెండ్ మీకు ఎలా దొరికాడు ఆనంద్ అని ప్రశ్నిస్తుంది. ఇమ్మానుయేల్ పేరును నువ్వు టాటూగా వేయించుకున్నావా అంటూ ఆశ్చర్యపోతుంది.

Anand Devarakonda and Jabardasth Emmanuel Pranks Unknown in Car | Gam Gam  Ganesha Movie | TFPC

దానికి ఆనంద్ రియాక్ట్ అవుతూ వాడి హెయిర్ స్టైల్ నాకు చాలా నచ్చుతుంది.. అందుకే వాడి టాటూ వేయించుకున్న అంటూ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వైరల్ గా మారడంతో ఆనంద్ టాటూ గురించి అంత మాట్లాడుకుంటున్నారు. వీరిద్ద‌రి మధ్య అంతా స్ట్రాంగ్ బంధం ఉందా అంటూ షాక అవుతున్నారు నెటిజ‌న్స్‌. కానీ గం గం గణేశా సినిమాలో ఇమ్మానియేల్ త‌న స్నేహితుడిగా కనిపించాడు. ఇక సినిమా కోసం తాత్కాలికంగా అటాటూను ఆనంద్ వేయించుకున్నట్లు సమాచారం. సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఆ టాటూను ఆనంద్ తొలగించేస్తారట.