ఓరి దేవుడోయ్.. ఈ రామ్ పోతినేనికి ఏమైంది.. అలాంటి రిస్క్ చేస్తున్నాడు ఏంటి..?

రామ్ పోతినేని ..దేవదాసు సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . కాగా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఎంట్రీ ఇస్తారు .. ఆ తర్వాత సక్సెస్ కొట్టలేక ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు . కానీ రామ్ పోతినేని డిఫరెంట్ క్యారెక్టర్. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదలు ఆయన హిట్లు కన్నా ఫ్లాప్ లనే తన ఖాతాలో ఎక్కువగా వేసుకున్నాడు . అంతేకాదు పలు సినిమాల విషయంలో ట్రోలింగ్ కూడా ఫేస్ చేశాడు . కానీ అటువంటి ట్రోలింగ్ని ఏమాత్రం బుర్రకు ఎక్కించుకొని రాంపోతినేని తన పని తాను చూసుకుని పోతూ ఉన్నాడు .

ప్రెసెంట్ రాం పోతినేని డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో డబల్ ఇస్మార్ట్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ షేడ్స్ పాత్రలో నటించబోతున్నారు . రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అభిమానులను ఎలా ఆకట్టుకునింది అనే విషయం గురించి మళ్ళీ మళ్ళీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . దిమాక్ కిరికిరి అంటూ మరోసారి తన మార్క్ మాస్ డైలాగ్స్ తో రచ్చ లేపేసాడు రామ్ పోతినేని .

‘కిరాక్ పొరొస్తే సైట్ మార్..ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్ప మార్.. నాక్ తెల్వకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గు..కాలుతది..ఒక్కొక్కని మొలకి లడీ కడ్తా..గ్రానెట్ గుచ్చి పిన్ను పిక్తా..అంటూ రామ్ మాస్ ని చూపించాడు పూరీ.. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ మొదలైంది. ఈ నేపధ్యంలో బడ్జెట్ గురించి హాట్ టాపిక్ గా మారింది . ఇప్పటివరకు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఆల్మోస్ట్ లాస్ట్ మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ..రాంపోతినేని నటించిన లాస్ట్ మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . దీంతో అందరి కళ్ళు ఇప్పుడు ఈ సినిమా పైనే పడ్డాయి. ఈ సినిమా కోసం ఇప్పుడు 65 – 70 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అనే టాక్ వినిపిస్తుంది. క్యాస్ట్ అంటూ క్రూ రెమ్యూనరేషన్ కింద ఎక్కువ అమౌంట్ వెళ్ళింది అంటూ టాక్ వినిపిస్తుంది . దీంతో పెట్టిన బడ్జెట్ రాబడతారా లేదా అన్న విషయం ప్రశ్నార్ధకంగా మారింది. రామ్ పోతినేని బిగ్ రిస్క్ చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం..!!