ఆ స్టార్ హీరో చేయాల్సిన మనం సినిమా..రాత్రికి రాత్రికి ఎలా చేతులు మారింది..?

ఎస్ ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. “మనం” అక్కినేని ఫ్యామిలీ ఎప్పటికీ మర్చిపోలేని సినిమా . నాగేశ్వరరావు – నాగార్జున – నాగచైతన్య – అఖిల్ – అమల ఈ సినిమాలో కలిసిన నటించి మెప్పించారు . ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు పూర్తిచేసుకుంది . ఈ సందర్భంలోనే స్పెషల్ షోస్ కూడా వేసి అక్కినేని అభిమానులను బాగా ఆకట్టుకున్నారు. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు ఫ్యాన్స్ కి హర్టింగ్గా అనిపిస్తుంది .

నిజానికి ఈ మూవీ డైరెక్టర్ విక్రమ్ కుమార్.. ఈ సినిమాని వేరే హీరోస్తో తెరకెక్కించాలనుకున్నారట . తండ్రి పాత్రలో వెంకటేష్ కొడుకు పాత్రలో సిద్ధార్ధ్..తాత పాత్రలో విశ్వనాధ్ గార్లను అనుకున్నారట. అయితే వాళ్ల టైం బ్యాడ్ ..అదే మూమెంట్లో అక్కినేని ఫ్యామిలీ ఒక సినిమాలో కలిసి నటించేందుకు బాగా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంది అని తెలుసుకున్న విక్రమ్ కుమార్ ఈ స్టోరీని తీసుకెళ్లి నాగార్జునకి వినిపించారు .

స్పాట్లోనే అగ్రిమెంట్ పై సైన్ చేసేయడం ..వెంట వెంటనే షూట్ స్టార్ట్ చేసేయడం చేసేసారు నాగార్జున . ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాలా .. ఈ సినిమా కోసం శ్రేయ శరణ్ కూడా బాగా కష్టపడింది . సమంత ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. లాస్ట్ మినిట్ లో అఖిల్ – అమలా గెస్ట్ పాత్రలో కనిపిస్తారు . అలా ఈ సినిమా రాత్రికి రాత్రి సిద్ధార్ధ్ చేతుల్లో నుంచి నాగార్జున చేతుల్లోకి వచ్చేసింది అన్నమాట..!!