తాత రూపం తారక్ కి దేవుడు ఇచ్చిన వరం.. ఎన్టీఆర్ గురించి నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. తాతకు తగ్గ మనవడిగా నటనలో తన సత్తా చాటుకున్నాడు. నిన్న, మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్న తారక్. రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా మారాడు. తన నటనతో విదేశాల్లోనూ, ఇతర దేశాల్లోనూ మంచి ఫ్యాన్ బేస్‌ సంపాదించుకున్న తారక్.. ఎంత ఎదిగిన అంతే ఒదిగి ఉంటాడు. స్టార్ అనే గర్వం అస‌లు లేకుండా తన తోటి వారిని గౌరవిస్తాడు. అందరితో సరదాగా ఉంటాడని.. అతనితో పని చేసిన చాలా మంది ఇప్పటికే ప‌లు సందర్భాల్లో వివరించారు.

Sudha : ఆ సమయంలో ఎన్టీఆర్ నా కాళ్ళు పట్టుకొని అలా చేశాడు.. స్టార్ హీరో  అయినా వాడు అనే అంటాను.. | Senior artist sudha comments on ntr-10TV Telugu

తాజాగా ఓ సీనియర్ నటి తారక్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన సుధా.. అమ్మగా, అత్తగా, వదినగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల సుధా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తో కలిసి నేను చాలా సినిమాల్లో నటించా.. అలాగే శీను వైట్ల డైరెక్షన్లో బాద్షాలోనూ ఆయనతో కలిసి చేశా. ఈ సినిమాలో ఓ డ్యాన్స్ సన్నివేశం లో తారక్ తో కలిసి డ్యాన్స్ వేయాలి. అయితే ఒక్కసారి డ్యాన్స్ చేసిన వెంటనే నేను మరోటెక్ చేద్దాం అని డైరెక్టర్ తో చెపా. అప్పుడు తారక్ ఎందుకమ్మా మీరు బానే చేశారు అన్నారు. నేను లేదు నాన్న మరోసారి చేద్దాం అని చెప్పి చేస్తుంటే ఇంతలో కాలు స్లిపై పడిపోయా.

NTR's stature won't be reduced by the renaming: Jr NTR

దీంతో నా కాలు బాగా వాచి ఎంతో ఇబ్బంది పడ్డ.. తారక్ వెంటనే వచ్చి నా కాలు పట్టుకుని సవరదీశారు. నేను వద్దు బాబు అంటున్నా కూడా మీరు ఉండండి అమ్మ నాకు అమ్మలాంటివారు.. అంటూ నా కాలు పట్టుకుని స్ప్రే తెప్పించి వాచిన దగ్గర స్ప్రే చేశాడు అంటూ వివరించింది. అతను ఓ స్టార్. అతనికి అసలు అలాంటిది అవసరమే లేదు. ఎవరికైనా చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ నా కాళ్లు పట్టుకొని నేను చెప్పాను కదా అమ్మ మొదటి టేక్ ఓకే చేయాల్సింది అంటూ ఆప్యాయంగా.. వినయంగా మాట్లాడాడు. అతని లాంటి మంచి వ్యక్తి మరొకరు ఉండరు. తారక్ నిజంగా గ్రేట్ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తాత రూపం దేవుడు ఇచ్చాడు మనస్తత్వం కూడా ఆయనదే వచ్చేసింది.. అందుకే ఆయనను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తారు అంటూ.. అది మా తారక్ అన్న మంచి మనసు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.