మనకు తెలిసిందే ప్రజెంట్ సోషల్ మీడియాలో బాలయ్య పేరు ఏ విధంగా ట్రోలింగ్కి గురవుతుందో .. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ కా దాస్ గా పాపులారిటీ సంపాదించుకున్న విశ్వక్సేన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు నందమూరి బాలకృష్ణ . మొదటి నుంచి టాలెంట్ ఎక్కడ ఉన్నా ఎంకరేజ్ చేసే బాలకృష్ణ విశ్వక్సేను సపోర్ట్ చేయడానికి ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే స్టేజ్ పైకి వచ్చిన బాలయ్య తనదైన స్టైల్ లో మాట్లాడి అల్లరి చేసి చమత్కరించారు . ఈ క్రమంలోనే హీరోయిన్ అంజలిని సరదాగా ఆట పట్టిస్తూ నెట్టివేశాడు.
దీంతో ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అయింది. పలువురు బాలయ్యను బూతులు కూడా తిట్టారు . మరికొందరు ట్రోల్ చేశారు. తాజాగా ఇష్యూ పై హీరోయిన్ అంజలి కూడా స్పందించింది . మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ర్యాపో ఉంది అంటూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది . అయితే తాజాగా ఇప్పుడు వార్తకు సంబంధించిన మరో న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలయ్య అంటే పడని వ్యక్తులే కావాలని కొందరు ఆ వీడియోని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో చీప్ గా వల్గర్ చేస్తున్నారట .
మొదటి నుంచి బాలయ్య ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు ..ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాడు.. అది నచ్చని కొంతమంది ఆయనను ఇలా వెటకారంగా వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు అని ఆ పనికిమాలిన వెధవలె ఈ విధంగా బాలయ్య పరువు తీయడానికి చూస్తున్నారు అని.. కానీ బాలయ్య ఎప్పుడు టాప్ పొజిషన్లోనే ఉంటాడు అని నందమూరి ఫ్యాన్స్ వెనకేసుకొస్తున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను ఓకే చేశాడు. ఈ సినిమా తర్వాత అఖండ 2 సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు..!!