సినిమా హిట్ అవ్వడానికి ఆనంద్ దేవరకొండ అలా చేశాడా..? అన్ననే మించి పోతున్నాడుగా..!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆనంద్ దేవరకొండ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలు రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బ్రదర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించి ఆకట్టుకుంటున్నాడు. ఆనంద్ దేవరకొండ సినిమాల చూసింగ్స్ ఎలా డిఫరెంట్ గా ఉంటాయో మనకు తెలిసిందే . ఇప్పటివరకు ఆయన ఒక సినిమా స్టోరీని మరొక సినిమా విషయంలో రిపీట్ చేయలేదు.

అలాంటి ఓ విభిన్నమైన కథలతో మన ముందుకు వస్తున్నాడు . తాజాగా ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా గం గం గణేశా. ఈ సినిమా చాలా కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకేక్కింది. ఈ సినిమా చాలా చాలా బాగుంది అంటున్నారు జనాలు. మరీ ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ పర్ఫామెన్స్ బాగా హైలైట్ గా నిలిచింది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో సినిమాపై మరిన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి .

ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆనంద్ దేవరకొండ చేసిన ప్రమోషన్స్ నే అంటూ చెప్పుకు వస్తున్నారు. మనకు తెలిసిందే విజయ్ దేవరకొండ తన సినిమాల ప్రమోషన్స్ కోసం ఎంత కష్టపడతాడో..ఇప్పుడు తమ్ముడు కూడా అదే రేంజ్ లో సినిమా ప్రమోషన్స్ కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఆ కారణంగానే ఈ సినిమా హిట్ అయింది అంటున్నారు అభిమానులు. ఇదే రేంజ్ లో ముందుకు వెళ్లితే ఇందస్ట్రీలో మరో టాప్ మోస్ట్ స్ధానాని అందుకుంటాడు ఈ హీరో..!!