“మీరు బొచ్చు కూడా పీకలేరు రా”..ఎన్టీఆర్ పై ఇలాంటి ఛండాలమైన కామెంట్స్ ..ఫ్యాన్స్ తట్టుకోగలరా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరుని ఎలా డీగ్రేడ్ చేస్తూ కొందరు కావాలనే ట్రోల్ చేస్తున్నారు మనకు తెలిసిందే. అయితే ఇంతవరకు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై జరిగిన ట్రోలింగ్ ఒక ఎత్తు రీసెంట్గా నందమూరి చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చిన విధానం ఒక ఎత్తు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే.. రీసెంట్ గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా చాలా ఘనంగా తన బర్త డే ను సెలబ్రేట్ చేసుకున్నారు .

ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీ సినీ సెలబ్రెటీ మెంబర్స్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత కొడాలి నాని సైతం ఆయనకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఎన్టీఆర్ తో కలిసి దిగిన రేర్ ఫోటోను షేర్ చేస్తూ ..”నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు “అంటూ రాస్కొచ్చాడు . అయితే దీనిపై నందమూరి వారసుడు చైతన్య కృష్ణ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

“జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అలాగే వైసిపి వాళ్లకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కొడాలి నాని.. వల్లభనేని వంశీ మీరు ఎవరు మా బొచ్చు కూడా పీకలేరు.. నేను ఉండగా చంద్రబాబు నాయుడు మామయ్యని నందమూరి బాలకృష్ణ బాబాయ్ ని ఏం చేయలేరు..నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మీరంతా బాగా ట్రోల్ చేశారు ..జాగ్రత్తగా ఉండండి ” అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు . ఫేస్బుక్ అకౌంట్ లో నందమూరి చైతన్య కృష్ణ పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది..!!