తప్పు చేస్తున్నావ్ ఎన్టీఆర్..భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..గెట్ రెడీ..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరుని కావాలనే ట్రోల్ చేయడానికి జనాలు బాగా బాగా ట్రై చేస్తున్నారు . నాకు సంబంధం లేదు.. ఈ పాలిటిక్స్ తో నాకు పని లేదు అంటూ తన పని తాను చూసుకుంటూ వెళ్ళిపోతున్న సరే కావాలని ఆ పార్టీకి సపోర్ట్ చేయలేదు .. ఈ పార్టీకి సపోర్ట్ చేయలేదు అంటూ నానా రాద్ధాంతం చేస్తున్నారు . నాకు ఈ రాజకీయాలు వద్దు రా బాబోయ్.. నా సినిమాలు నేను చేసుకుంటాను అంటూ ఎన్టీఆర్ గమ్మునే ఉన్నా కూడా గుచ్చి గెలుకుతున్నారు .

తాజాగా ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా అలాంటి ఒక న్యూస్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది . ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా స్టార్స్ అందరూ కూడా ఆయనకు విష్ చేశారు . అయితే ఎన్టీఆర్ కూడా వాళ్ళందరికీ తిరిగి థాంక్యూ అంటూ రిటర్న్ మెసేజెస్ పెట్టారు . కానీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మాత్రం ఆయన రిప్లై ఇవ్వలేదు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా స్పెషల్ నోట్ రిలీజ్ చేసి ఆయనకు విషెస్ అందించారు . అయితే తారక్ అది చూసి చూడనట్లు సైలెంట్ గా అయిపోయారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై మండిపడుతున్నారు .

“నీకు రాజకీయాలు అంటే పడవు ఓకే ..ఒప్పుకుంటాం.. అంత పెద్ద వ్యక్తి మెసేజ్ పెట్టినప్పుడు రిప్లై ఇవ్వాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేదా ..? అంటూ తిట్టిపోస్తున్నారు. మరికొందరు మాత్రం పొలిటికల్ పరంగా జనసేన తరఫున విష్ చేశాడు అని.. ఆ కారణంగానే ఎన్టీఆర్ రిప్లై ఇవ్వలేదు అని నార్మల్గా ట్విట్టర్ వేదికగా జనసేన పేరు లేకుండా ఫ్రెండ్లీగా సినిమా కల్చర్ తో పెట్టుంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ కి ఎన్టీఆర్ రిప్లై ఇస్తాడు అని . పెద్దలని గౌరవించడం ఎన్టీఆర్ కి బాగా తెలుసు అని.. నందమూరి ఫ్యాన్స్ తిరిగి పవన్ కళ్యాణ్ అభిమానులకే కౌంటర్ వేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . కొంతమంది ఎన్టీఆర్ తప్పు చేస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు..!!