ఆ విషయాని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న నాగ చైతన్య..వీడియో వైరల్..!

నాగచైతన్య .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో అవ్వడానికి ప్రయత్నిస్తున్న యంగ్ హీరో.. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆ తర్వాత విడాకులు తీసుకున్నాడు .. ఆ తర్వాత నాగచైతన్య కెరియర్ ఎలా మారిపోయిందో మనకు తెలిసిందే. ప్రజెంట్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అక్కినేని ఫ్యామిలీకి ఎంతో మైల్ స్టోన్ గా నిలిచిన సినిమా మనం . నాగేశ్వరరావు గారు – నాగార్జున – నాగచైతన్య – అఖిల్ – అమల – సమంత – శ్రేయ శరణ్ కలిసిన నటించిన సినిమా.

ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ సినిమా అక్కినేని అభిమానులకు ఫేవరెట్ మూవీ . కాగా ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు పూర్తి చేసుకుంది . ఈ క్రమంలోనే సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేశారు . అభిమానులతో పాటు థియేటర్లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశాడు నాగచైతన్య . దానికి సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి . అయితే సమంతతో పెళ్లి సీను రాగానే అక్కడ ఉండే జనాలు కెవ్వు కెవ్వు అంటూ అరవడం గమనార్హం .

కాగా ఇప్పుడు మరొక వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య స్క్రీన్ పై తన తాతగారు నాగేశ్వరరావు చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నారు . ఆయనతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ ను గుర్తు చేసుకున్నట్లు అర్థమవుతుంది . చాలా చాలా రిజర్వ్డ్ గా ఉండే నాగచైతన్య అలా అంతమంది అభిమానులు ముందు తాతని చూడగానే తన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు . ఈ విషయాన్ని పక్కనే ఉన్న వాళ్ళు బాగా గమనించారు . దీంతో సోషల్ మీడియాలో ఆయన వీడియోని ట్రెండ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. అక్కినేని నాగచైతన్యకు తన తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం ఈ విషయం ఆయన బతికున్నప్పుడు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకు వచ్చారు. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!