వామ్మో..ఆ స్టార్ డైరెక్టర్ పరిస్ధితి అంత దారుణంగా ఉందా..? ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న న్యూస్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఏ వార్త నిజం ఏ వార్త అబద్దం అని తెలుసుకోవడం చాలా చాలా కష్టంగా మారిపోతుంది. ఎంతలా అంటే ఈ వార్త నిజం కాదేమో అని అనుకునేసరికి ఆ వార్త నిజం అంటూ వాళ్ళే చెప్పేస్తున్నారు.. బహుశా ఈ వార్త నిజమేమో అని అనుకునేసరికి ఇదంతా ఫేక్ అంటూ స్టార్ సెలబ్రెటీసే క్లారిటీ ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వార్త నిజమని నమ్మడానికి లేదు అలా అని వైరల్ అయ్యే ప్రతి వార్త అబద్దం అని చెప్పడానికి లేదు అయోమయ సిచువేషన్ క్రియేట్ చేసేస్తోంది ఈ సోషల్ మీడియా.

తాజాగా సోషల్ మీడియాలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ హెల్త్ కండిషన్ పై కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వివి వినాయక్ తెలుగు ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఠాగూర్ సినిమాను తెరకెక్కించింది ఈయననే.. మెగాస్టార్ స్టామినా అందరికీ తెలిసేలా చేసింది వివి వినాయక్ నే.. అలాంటి వివి వినాయక్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఆఫ్ కోర్స్ యంగ్ డైరెక్టర్స్ వచ్చాక పాత డైరెక్టర్ ల సీన్ మొత్తం మారిపోయింది . కానీ వివి వినాయక్ మాత్రం కాస్తో కూస్తో సీనియర్ హీరోస్తో సినిమాలను తెరకెక్కిస్తూ వచ్చారు.

ఈ మధ్యకాలంలో చిరంజీవి – బాలయ్య లాంటి హీరోలతో కూడా సినిమా తీయబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది . అయితే ఆ ప్రచారం అక్కడితోనే ఆగిపోయింది. రీసెంట్గా వివి వినాయక్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అన్న వార్త వైరల్ గా మారింది. ఆయన జీర్ణకు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారట . ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారట . ఆ కారణంగానే కేవలం ఇంటికే పరిమితమయ్యారట వివి వినాయక్ .మరో ఆందోళనకరణ విషయం ఏమిటంటే వివి వినాయక్ బాగా లావు తగ్గిపోయారట . ఆయన అనారోగ్య సమస్యల కారణంగా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారట . కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటున్నారట . దీంతో వివి వినాయక్ సోదరుడు విజయ్ స్పందించాడు. ఆయన ఆరోగ్యం బాగోలేదు అన్న విషయం నిజమే కానీ ఇప్పటిది కాదు కొన్ని నెలల క్రితం ఇప్పుడు ఆయన పూర్తిగా కోల్కున్నారు అని విజయ్ క్లారిటీ ఇచ్చారు..!!