“అందరు అదే పేరుతో పిలుస్తున్నారు”..స్టేజీ పై వెక్కి వెక్కి ఏడ్చేసిన వైష్ణవి చైతన్య..!?

సోషల్ మీడియాలో ఎంత పాజిటివిటీ ఉంటుందో.. అంతే నెగిటివిటీ ఉంటుంది . సోషల్ మీడియాలో అడుగు పెట్టాక అలాంటివి భరించాలి .. తప్పదు .. చాలామంది ఈ విషయాలను చెప్పుకొస్తూనే ఉంటారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో వైష్ణవి చైతన్య చేసిన కామెంట్స్ అందరిని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. మనకు తెలిసిందే ఒకప్పుడు యూట్యూబర్ గా ఇప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తుంది .

మరి ముఖ్యంగా వైష్ణవి చైతన్య నటించిన బేబి సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగ రాసింది. అంతేకాదు వైష్ణవి చైతన్య ఇప్పుడు ఆశిష్ తో కలిసి లవ్ మీ అనే సినిమాలో నటిస్తుంది . మే 25వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. వైష్ణవి చైతన్య తన ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్ లో మార్ఫ్ చేసి అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారు అని బాధపడ్డింది.

అది తనకి తన కుటుంబానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంది అని పచ్చి బూతులతో పిలుస్తున్నారు అని.. దయచేసి అలాంటివి మానుకోండి అంటూ రిక్వెస్ట్ చేసింది. వైష్ణవి చైతన్య మాటలకు స్టేజిపై ఉన్న కీరవాణి సైతం ఎమోషనల్ అయిపోయారు. ప్రెసెంట్ దీనికి సంబంధించిన న్యూస్ నెత్తిన బాగా వైరల్ గా మారింది . కేవలం వైష్ణవి చైతన్య పైనే కాదు చాలామంది హీరోయిన్స్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం..!!