పీరియడ్స్ టైంలో షూటింగ్ షెడ్యూల్స్ వస్తే .. సాయి పల్లవి-శృతి హాసన్ ఏం చేస్తారో తెలుసా..?

ఆడవాళ్ళకి పీరియడ్స్ సమస్య ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ మూడు రోజుల సమయం చాలా నరకంగా ఉంటుంది . ఆ పెయిన్ అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది . అయితే పెయిన్ ఉంది కదా అని ఇంట్లో కూర్చుంటే పనులు అవుతాయా..? అస్సలకి ఎటువంటి మహిళ అయినా సరే పీరియడ్స్ టైం లో పని చేయాల్సిందే ..పని చేయకపోతే పనులు ఆగిపోతాయి. కాగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ పీరియడ్స్ టైం లో చాలామంది రెస్ట్ తీసుకుంటారు . కానీ కొంతమంది మాత్రం అలాంటి రెస్ట్ తీసుకోకుండా సినిమాల కోసం కమిట్ అయిన సినిమాలను ఓకే చేస్తూ ఉంటారు . షూటింగ్లో పాల్గొంటూ ఉంటారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఫేస్ చేసింది అందాల ముద్దుగుమ్మ మలయాళ బ్యూటీ సాయి పల్లవి. అంతేకాదు అది ఏదో ఇబ్బందికర ప్రశ్నల ఫీల్ అవ్వకుండా చాలా ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చింది. దీనితో సోషల్ మీడియాలో సాయి పల్లవి ఆన్సర్ బాగా వైరల్ గా మారింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి కు..” మీరు పీరియడ్స్ టైం లో షూటింగ్స్ ఎలా మేనేజ్ చేస్తారు..?” అనే ప్రశ్న ఎదురైంది . దీనికి చాలా కామ్ గా ..కూల్ గా .. ఓపెన్ మైండ్ తో ఆన్సర్ ఇచ్చింది సాయి పల్లవి .

“అఫ్కోర్స్ ఈ ప్రాబ్లం అందరికీ కామన్ ఖచ్చితంగా.. ఫేస్ చేయాల్సిందే ఆ టైంలో కొంచెం ఇబ్బంది గా ఉంటుంది.. సినిమా షూట్స్ ఉన్నప్పుడు ఇబ్బంది కరంగా కూడా ఉంటుంది ..అయితే ఆ టైంలో డాన్స్ చేయాల్సిన పొజిషన్ వచ్చినప్పుడు ఇంకా నరకం కానీ ఏం చేయలేం.. తగిన ప్రికాషన్స్ తీసుకొని డాన్స్ చేయడమే ..నేను నా కెరియర్ లో అలా చేసిన సాంగ్స్ కూడా ఉన్నాయి .. మరీ ముఖ్యంగా శ్యాం సింగరాయ్ మూవీలో ఓ పాట సమయంలో అదే విధంగా నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.. విపరీతమైన నొప్పితో అల్లాడిపోయాను ..కానీ సాంగ్ పూర్తి చేశాను” అంటూ చెప్పుకొచ్చింది.

దీంతో సాయి పల్లవి ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు అభిమానులు. గతంలో హీరోయిన్ శృతిహాసన్ కి సైతం ఇదే ప్రశ్న ఎదురవగా చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది . అన్ని ప్రాబ్లమ్స్ లాగే ఇది కూడా.. బీట్ చేసి ముందుకు వెళ్లాల్సిందే తగిన ప్రికాషన్స్ తీసుకొని షూటింగ్లో పాల్గొంటాను” అంటూ ఆన్సర్ ఇచ్చింది. సాయి పల్లవి – శృతిహాసన్ పేర్లు ఇప్పుడు వైరల్ గా మారాయి..!!