ఆ విషయంలో నాన్నకు దక్కని అదృష్టం నాకు వచ్చింది.. బాలయ్య షాకింగ్ కామెంట్స్..?!

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఎన్ని రోజులు ఎన్నికల హడావిడిలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన బాలయ్య.. ఎన్నికల సందడి పూర్తి కావడంతో తిరిగి సినిమా పనుల్లో బిజీ అయ్యాడు. ఇక తాజాగా బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన సత్యభామ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో భాగంగా బాలయ్య మాట్లాడుతూ తన తండ్రి తారక రామారావు గురించి సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారాయి.

Balayya Talks About Legacy & Inheritance! | Balayya Talks About Legacy &  Inheritance!

బాలయ్య మాట్లాడుతూ అప్పట్లో నాన్నగారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ పై అవ‌గాహ‌న తెచ్చుకున్నారు. అన్నిటిలో ప‌ని చేశారు. విభిన్నమైన క్యారెక్టర్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ నాన్నగారు ఇప్పటివరకు నారద ముని పాత్రలో నటించలేదు. ఇలా నాన్న చేయాలని ఆ పాత్ర నేను చేశా.. అలాంటి అదృష్టం నాకు దక్కింది అంటూ వివరించాడు. అప్పట్లో ఆయన దూరదృష్టితో కథలను ఎంచుకొని సినిమాలు నటించేవారు.

ఆ టైం కి అది సక్సెస్ సాధించకపోయినా.. ఇప్పుడు అవే కాసుల వర్షం కురిపించేలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. కాజల్ సినిమా గురించి మాట్లాడుతూ సత్యభామ ట్రైలర్ అద్భుతంగా ఉందని.. ఆర్టిస్ట్ అంటే నవ్వించడం, ఏడిపించడం కాదు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి జీవించడం అంటూ ఆయన వివరించాడు. కాజల్ ఓ బిడ్డకు తల్లి అయిన సినిమాల్లో నటించడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే బాలయ్య.. ఎన్టీఆర్ విషయంలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.