నందమూరి బాలయ్య.. ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటాడో మనకు బాగా తెలుసు . ఆయన సినిమాలో రొమాంటిక్ సీన్స్ కన్నా కూడా యాక్షన్ మాస్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి . ఇప్పటివరకు బాలయ్య ఎన్నో సినిమాలు నటించారు. కానీ ఏ సినిమాల్లోనూ హద్దులు మీరలేదు. అసభ్యకర సన్నివేశాలలో నటించలేదు . మహిళలను కించపరిచే విధంగా ఉన్న సీన్స్ లో నటించలేదు. కాగా నిన్న మొన్నటి వరకు ఎలక్షన్స్ పనుల్లో బిజీ బిజీగా మునిగిపోయిన బాలయ్య ఇప్పుడు బాబీతో తెరకెక్కే సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నాడు.
కాగా ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే బోయపాటి శ్రీనుతో అఖండ 2 ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా కంటే ముందే బాలయ్య ఓ ఊర నాటు మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తుంది . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ పూరి జగన్నాధ్ టైం బాగోలేదు. కానీ బాలయ్య ఎప్పుడు డైరెక్టర్ ల ట్రాక్ రికార్డు చూసి సినిమా ఛాన్స్ ఇవ్వడు.
ఆ కారణంగానే పూరి జగన్నాధ్ కి ఆఫర్ ఇచ్చారట . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది . మళ్లీ పైసా వసూల్ లాంటి సినిమా కన్ఫామ్ అంటూ వీళ్ళిద్దరి కాంబో ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు. అరె మామ ఏక్ పెగ్ లా అంటూ బాలయ్య పూరి జగన్నాథ్ ఫొటోస్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు. చూద్దాం మరి దీని పై అఫిషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో..??