ఒకరు బాగుపడుతున్నారు అంటే అతగాడిని తొక్కేయడానికి నాలుగు చేతులు నాలుగు కాళ్లు ఎప్పుడు రెడీగా ఉంటాయి. అది ఏ రంగమైన సరే ..ఎలాంటి వాళ్ళు అయినా సరే ..పక్క మనిషి బాగుపడుతున్నాడు అంటే పోనీలే ఆ వ్యక్తి కష్టానికి ప్రతిఫలం దక్కింది అని అనుకునే వాళ్ళ కన్నా వాడు బాగుపడిపోతున్నాడే మనం బాగుపడలేకపోతున్నాము అని బాధపడేవాళ్లు ..వాడు బాగుపడుతున్నాడు ఎలాగైనా నాశనం చేయాలి అని అనుకునే జనాలు చాలామంది ఉంటారు . మనం కూడా లైఫ్లో అలాంటి సిచువేషన్స్ ఫేస్ చేసే ఉంటాం .
కాగా రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ గా మారింది . ప్రజెంట్ బన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి సెకండ్ పాట విడుదల చేశారు మూవీ టీం . ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది . అభిమానులే కాకుండా సామాన్య జనాలను సైతం ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది . అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ పాట అన్ని భాషలలోనూ హ్యూజ్ సక్సెస్ అందుకుంది.
కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ పాట బాగున్న సరే పాటపై నెగటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు . కావాలనే కొంతమంది ప్రముఖులు పుష్ప 2 సినిమాను బాలీవుడ్ లో తొక్కేయడానికి బన్నీ కెరియర్ ఎదగనీయకుండా ఉండడానికి ఇలా చేస్తున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బన్నీ జాగ్రత్త అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సజెషన్స్ ఇస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా మరొక బ్యూటీ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమాలో ఐటెం సాంగ్స్ చేయబోతున్నట్లు తెగ ప్రచారం జరుగుతుంది..!!