50 కోట్లు ఇస్తే కానీ ఆ పని చేయను.. నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న తెలుగు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్..!

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ డిమాండ్స్ చేసేది కేవలం హీరోలే .. స్టార్ హీరోలు బడాబడా హీరోలు ఫామ్ ఉన్న హీరోలు మాత్రమే తమకు మార్కెట్ పరంగా ఒక రేట్లు ఫిక్స్ చేసుకొని అంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి అంటూ డిమాండ్ చేసేవాళ్ళు . రాను రాను ఆ పద్ధతి మారిపోయింది. ఇప్పుడు కేవలం స్టార్ హీరోలు పాన్ ఇండియా హీరోలు మాత్రమే కాదు ..హీరోయిన్స్, పాన్ ఇండియా బ్యూటీస్, చైల్డ్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో చిన్నచితకా పాత్రలు చేసుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా మా పాత్రకి ఇంత రెమ్యూనరేషన్ ఇస్తేనే ఓకే చేస్తాం అన్న స్థాయికి వచ్చేసారు.. రీజన్ ఏంటో అర్థం కావడం లేదు కానీ …

చాలామంది సినిమా ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ మధ్యకాలంలో పలువురు స్టార్ట్ డైరెక్టర్స్ కూడా 100 కోట్ల రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నారు అన్న వార్తలు మనం విన్నం . బడాబడా డైరెక్టర్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న దర్శకులు ఒక్కొక్క సినిమాకి 70-80-90 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతున్నారట . అందుకే భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి . అయితే రీసెంట్ గా ఇండస్ట్రీలో ఒక న్యూస్ వైరల్ గా మారింది .

స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ దర్శకుడు 50 కోట్లు చేతిలో పెడితే కానీ సినిమాకి ఓకే చెయ్యను అంటూ మొండిగా కూర్చుంటున్నాడట . మంచి పేరు పబ్లిసిటీ పాపులారిటీ ఉన్న ఈ దర్శకుడు అసలు డబ్బు మనిషే కాదు ..డబ్బుకు విలువ ఇవ్వడు.. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఈ విధంగా మారిపోయాడు.. పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్న రేంజ్ లో బడా డైరెక్టర్స్ ను చూసి ఈ డైరెక్టర్ ఇలా చేస్తున్నాడు అంటున్నారు జనాలు.

అయితే మిగతా డైరెక్టర్ ల పరిస్థితి వేరు. వాళ్ళు ఎలా తీసిన సినిమాలు హిట్ అవుతాయి ..నీకు ఆ సీన్ లేదు నువ్వు తెరకెక్కించిన సినిమా ఒక్కటి ఫ్లాప్ అయినా సరే కధా కంచికి వెళ్ళిపోతుంది ..జాగ్రత్త అంటూ ఫ్యాన్స్ సజెస్ట్ చేస్తున్నారు. అయితే నిర్మాతలు కూడా ఇతగాడి బిహేవియర్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది . ఇతగాడిని బాయ్ కాట్ చేయాలి అంటూ నిర్మాత మండలి నిర్ణయం కూడా తీసుకోబోతుందట . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??