ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు.. ఆ విషయంలో రాజమౌళినే మించిపోయిన కొరటాల..!

దేవర .. ప్రెసెంట్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు. కొన్ని కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వకుండానే చరిత్ర సృష్టిస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలలో ఒకటే ఈ దేవర . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఇదే కావడం చాలా చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సిన విషయం . ఈ సినిమా కోసం తారక్ ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తున్నాడో కూడా మనకు తెలిసిందే.

ఆర్ ఆర్ ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరి ఈ సినిమా హిట్ కోసం బాగా కష్టపడుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నిన్న మొదటి వరకు ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ మాత్రమే కనిపించబోతుంది అనుకున్నారు . కానీ ఈ సినిమాలో ఐటెం సాంగ్ పాత్రలో టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే కూడా కనిపించబోతుందట .

Hot Photos of Kajal Agarwal in Businessman Movie

అయితే ఇప్పుడు మరొక న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది . కేవలం పూజ హెగ్డే మాత్రమే కాదు ఈ పాటలో కాజల్ అగర్వాల్ కూడా కొన్ని స్టెప్స్ వేయబోతుంది అంటూ లేటెస్ట్ సమాచారం అందుతుంది. ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ పూజా హెగ్డే తన స్టెప్స్ తో అదరగొడితే .. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ మధ్యలో యాడ్ అవుతుందని పాట క్లైమాక్స్లో జాన్వికపూర్ కూడా ఈ పాటలో చిందులేయబోతుందని ఓ న్యూస్ వైరల్ గా మారింది . గతంలో రాజమౌళి బాహుబలి సినిమాలో ఇలాగే ముగ్గురు బ్యూటీస్ తో ఐటెం సాంగ్ లో స్టెప్స్ వేయించాడు. దీంతో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు . చూద్దాం మరి కొరటాల తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో..?