ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసం ఆ పని చేయబోతున్న విజయ్ దేవరకొండ.. రౌడీ హీరో మాస్ ప్లాన్ అదుర్స్..!

విజయ్ దేవరకొండ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురైన వన్ అండ్ ఓన్లీ పేరు ఇదే అని చెప్పాలి . ఒకప్పుడు విజయ్ దేవరకొండ పేరు చెప్తే జనాలు ఏ రేంజ్ లో రచ్చ రంబోలా చేసే వాళ్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు చెప్తే ఆ విధంగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . అఫ్ కోర్స్ ఇదంతా సినిమా ఇండస్ట్రీలో కామన్ ..అది అందరికీ తెలిసిందే . సినిమా హిట్ అయినప్పుడు పొగడడం ఫ్లాప్ అయితే ట్రోల్ చేయడం సర్వసాధారణం . ఇది అందరికీ తెలిసిన విషయమే .

రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా దారుణాతి దారుణంగా ఫ్లాప్ అయింది. ఎంతలా అంటే ఆయన కెరియర్ లోనే పరమ చెత్త కలెక్షన్స్ క్రియేట్ చేసింది . విజయ్ దేవరకొండ ఫాన్స్ కి సైతం ఈ సినిమా నచ్చకుండా పోయింది అంటే సినిమా కాన్సెప్ట్ ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే విజయ్ దేవరకొండ లాంటి హీరోని ఇలా ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాలో చూపించాలి అనుకోవడం పరశురాం చేసిన పెద్ద తప్పు అంటున్నారు జనాలు.. అభిమానులకు కూడా ఇదే ఫీలింగ్ .

అయితే రీసెంట్గా విజయ్ దేవరకొండ తన ఫాన్స్ కోసం తన ఫాన్స్ హ్యాపీగా ఉండడం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఇకపై చూస్ చేసుకునే సినిమాలు అన్నీ కూడా ఫాన్స్ కి నచ్చే విధంగా ఫాన్స్ ని ఆకట్టుకునే విధంగానే చూస్ చేసుకోవాలనుకుంటున్నారట. కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చిన సరే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టే మూవీస్ ని చూస్ చేసుకోకూడదు అంటూ డిసైడ్ అయ్యారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.


మొత్తానికి ఒక్క నిర్ణయంతో సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాడు విజయ్ దేవరకొండ. చూద్దాం మరి రౌడీ హీరో తీసుకున్న నిర్ణయం ఏ వరకు సక్సెస్ అవుతుందో ..?అభిమానులను ఎలా ఆకట్టుకుంటుందో..??