ప్రభాస్ సినిమాపై గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగ.. ఫస్ట్ రోజే బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కా అంటూ..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగా ఒకరు. పాన్ ఇండియా లెవెల్ లో సందీప్ రెడ్డి భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆయన తెర‌కెక్కించిన మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలవడంతో సందీప్ రెడ్డి వంగాకు పాన్ ఇండియా లెవెల్ లో డిమాండ్ బాగా ఏర్పడింది. ఆయనతో సినిమాలు చేసేందుకు ప్రస్తుతం స్టార్ హీరోలంతా సిద్ధంగా ఉన్నారు. అలాగే సందీప్ ని నమ్మి వందల కోట్ల రూపాయలు కుమ్మరించడానికి నిర్మాతలు కూడా లైన్ లో ఉన్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కనిపించనున్నాడు.

Sandeep Reddy Vanga says Prabhas' Spirit will debut with 150 cr opening  day! – NTV ENGLISH

సందీప్ తెర‌కెక్కించిన‌ మూడు సినిమాలు సూపర్ హిట్స్ కావడం.. ఇక చివరిగా తెరకెక్కిన యానిమల్ ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత సందీప్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తుండ‌టంతో ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. తాజాగా ప్రభాస్‌తో ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు సందీప్ రెడ్డి వంగా. స్పిరిట్ మొదటి రోజు ఎంత కలెక్షన్ చేస్తుందో కూడా ఆయన అంచనాలు వేసేస్తున్నాడు. బడ్జెట్ గమనిస్తే నిర్మాత ఆల్రెడీ సేఫ్ అయిపోయినట్లే.. నాకు, ప్రభాస్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా బడ్జెట్ సాటిలైట్, డిజిటల్ హక్కుల నుంచి పూర్తిగా నిర్మాతకు వచ్చేస్తుంది.

Spirit: Prabhas look from Sandeep Reddy Vanga film

టీజ‌ర్‌, ట్రైలర్, పాటలు, ఫ్రీ రిలీజ్ ఇలా అన్ని అంశాలను జోడించుకుంటూ ప్రభాస్ స్పిరిట్‌ రిలీజైన మొదటి రోజే రూ.150 కోట్ల గ్రాస్ కొల్లగొట్టడం ఖాయం అంటూ.. ఇది నా లెక్క కాదు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అని సందీప్ రెడ్డి వివరించాడు. అయితే గతంలోనే ప్రభాస్ తో హాలీవుడ్ మూవీ ని తెలుగులో రీమిక్స్ చేసే అవ‌కాశం సందీప్ రెడ్డికి వచ్చిందని.. కానీ ఆ కథ ఆయనకు నచ్చకపోవడంతో ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. తర్వాత ప్రభాస్‌కు స్పిరిట్ క‌థ‌ వినిపించడం.. అది ప్రభాస్‌కు నచ్చడం అన్నీ చకచక జరిగిపోయాయి. అని అనుకున్నట్లు జరిగితే నవంబర్ లేదా డిసెంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్వయంగా సందీప్ రెడ్డివంగా ఫస్టే డే కలెక్షన్ల గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.