ఫ్యాన్స్ కి ఊహించని బిగ్ షాక్..విడాకులు తీసుకోబోతున్న స్టార్ క్రేజీ కపుల్.. !

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలను మనం ఎక్కువగా చూస్తున్నాం. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో మరోసారి స్టార్ జంటకు సంబంధించిన విడాకుల వార్తా హైలెట్గా నిలిచింది . కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ధనుష్ రజనీకాంత్ కుమార్ ఐశ్వర్యను 2004లో పెళ్లి చేసుకున్నాడు .

వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది . కొన్నేళ్లపాటు వీళ్ళ కాపురం బాగా సాగింది. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా చాలా చాలా హ్యాపీగా లైఫ్ లో ఎంజాయ్ చేశారు. సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళ మధ్య మనస్పర్ధలు తలెత్తాయి అంతే విడాకులు తీసుకోబోతున్నాం అంటూ ప్రకటించేశారు . రెండేళ్లుగా దూరం దూరంగానే ఉంటున్నారు. కానీ అఫీషియల్ గా విడాకులు మంజూరు కాకపోవడంతో వీళ్ళు పిల్లల కోసమైనా కలుస్తారు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు .

అయితే తాజాగా ఆ ఆశలు కూడా తుంచుకుపోయాయి. రెండేళ్లు దూరంగా ఉన్న తర్వాత వీళ్ళకి కోర్టు విడాకులు మంజూరు ప్రకటించింది అంటూ న్యూస్ వైరల్ గా మారింది. చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నారు ధనుష్ – ఐశ్వర్య అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. అంతేకాదు వీళ్ల విడాకులు మంజూరు చేయడానికి అంగీకరించిందట కోర్ట్. దీంతో మరో స్టార్ జంట విడాకులు తీసుకొని అభిమానుల గుండెలు బద్దలు చేసేసింది..!