“అలాంటి పని చేసిన తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు”.. డైరెక్టర్స్ పై హిమజ సంచలన కామెంట్స్..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలు తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు అన్న వాదన ఎప్పటినుంచో ఉంది . పలువురు స్టార్ సెలబ్రిటీస్ స్టార్ హీరోలు కూడా ఆ విషయాన్ని ఓపెన్ గా ఒప్పుకున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ. తెలుగు డైరెక్టర్లు ఎక్కువగా కన్నడ మలయాళం ముద్దుగుమ్మలని తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా దింపడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .చాలామంది తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి అని వాళ్ళు దానికి తగ్గట్టు టాలెంట్ .. కృషి పట్టుదలతో ముందుకు వెళ్లిన తెలుగు డైరెక్టర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు అంటూ చెప్పుకు వస్తూ ఉంటారు .

తాజాగా అలాంటి విషయాన్ని మరోసారి కన్ఫామ్ చేసింది హిమజ. బిగ్బాస్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హిమజ ..బిగ్బాస్లోకి వచ్చిన తర్వాత బాగా పాపులారిటీ సంపాదించుకుంది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హిమజాకు తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వకపోవడం పై ప్రశ్న ఎదురైంది . దీంతో హిమజ షాకింగ్ కామెంట్స్ చేసింది .

“తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ కాదని ఇప్పటికే రుజువైంది .. అసలు విషయం ఏమిటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ ఆఫర్స్ రావడం లేదు .. అవకాశాలు వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కాదు కదా.. అంతేకాదు చాలామంది వచ్చిన అవకాశాలను అత్యాశ వల్ల పోగొట్టుకుంటున్నారు.. తెలుగు అమ్మాయిలను కాకుండా కన్నడ మలయాళీ బ్యూటీలను చూస్ చేసుకోవడానికి వేరే రీజన్ కూడా ఉంది.. కొన్ని పాత్రలకు కొంతమంది సెట్ అవుతారు “అంటూ హిమజ చెప్పుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో హిమజా చేసిన కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి..!