బాలయ్య ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ అన్ స్టాపబుల్ సీజన్ 4 పై అఫీషియల్ అనౌన్స్మెంట్..?!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వ‌రుస‌గా హ్య‌ట్రిక్ హిట్లను అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్‌లో తన 109వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

NBK 109 first glimpse: Balakrishna begins the hunting | Latest Telugu  cinema news | Movie reviews | OTT Updates, OTT

మరోవైపు బాలయ్య సినిమా నటుడుగానే కాకుండా.. అన్‌స్టాపబుల్ షో తో హోస్ట్ గాను బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్ అందుకున్నారు. ఇప్పటికే ఈ షో మూడు సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలో బాల‌య్య‌కు మార్కెట్‌ కూడా రెట్టింపు అయ్యింద‌న‌టంలో సందేహం లేదు. ఇక ఈ మూడు సీజ‌న్‌ల త‌ర్వాత భగవంత్ కేసరి, యానిమల్ సినిమాల టీంల‌ కోసం ఈ మూడు సీజ‌న్‌ల‌ తరహ‌లో స్పెషల్ ఎపిసోడ్‌ల‌ను ఏర్పాటు చేశారు. అవి కూడా అన్‌ స్టాపబుల్ మూడు సీజన్‌ల లానే బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్స‌స్‌ను సంపాదించుకున్నాయి.

Balakrishna| బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది..

ఇక తాజాగా సీజన్ 4 కు రంగం సిద్ధమైందంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఉగాది సందర్భంగా ఈ ప్రోగ్రాం త్వరలో ప్రచారం చేయనున్నట్లు ఆహా ఓటీటీ వివరించింది. బాలయ్య సినిమాల కోసం ఏ రేంజ్ లో అయితే ఫాన్స్ ఎదురుచూస్తున్నారో అదే రేంజ్ లో ఆయన అన్‌స్టాప‌బుల్‌ సీజన్‌ల‌ కోసం కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సీజన్ 4కు రంగం సిద్ధమైందంటూ వార్తలు వినిపించడంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.