నాని ‘ సరిపోదా శనివారం ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఆ శనివారమే..!!

నాచురల్ స్టార్ నాని ఇటీవల నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి ఆయన క్రేజ్ ను మరింతగా పెంచేశాయి. ఇక చివరిగా దసరా, హాయ్ నాన్న‌ సినిమాలతో వరుస విజయాలను అందుకొని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మరో పాన్ ఇండియన్ మూవీ సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వివేకాత్రేయ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకు డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇక నిన్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుంటూ సినిమా కొత్త పోస్టర్ రివీల్ చేశారు మేకర్స్. ఇందులో నాని, సాయికుమార్ ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చారు. చిరునవ్వులు చిందిస్తూ వీరిద్దరూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఇక ఇప్పటివరకు రాని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా తెరకెక్కుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకుని ఓ క్రమంలో వాడుకుంటూ శనివారాలు మాత్రమే ముహూర్తంగా ఫిక్స్ చేసి శత్రువులను వేటాడే వ్యక్తిగా నాని ప్రేక్షకులకు కనిపించనున్నాడు.

Nani's first look from 'Saripodhaa Sanivaaram' unveiled - The Hindu

ఇక‌ ఈ సినిమా ఆగస్టు 29న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంద‌ని మేకర్స్ వివరించారు. వివేక్‌ ఆత్రేయ డైరెక్షన్లు తెర‌కెక్కుతున్న ఈ కథలో ప్రియాంక అరుణ్ మోహన్, ఎస్ జె సూర్య తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక మూవీ టైటిల్ కు తగ్గట్టుగానే రిలీజ్ డేట్ కూడా శనివారం ఫిక్స్ చేశారు మేకర్స్. ఇప్ప‌టికే సీనిమా టీజ‌ర్‌తో ప్రేక్ష‌కుల‌లో మంచి హైప్ నెల‌కొంది. ఈ క్ర‌మంలో సినిమా రిలీజై ఎలాంటి స‌క్స‌స్ అందుకుంటుందో వేచి చూడాలి.