ఆ ఛాన్స్ వస్తే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా.. విజయ్ ఆంటోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

వైవిధ్యమైన థ్రిల్లర్ కథ‌లని ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని. ఇప్పుడు ఆయన మొదటిసారిగా రొమాంటిక్ జానర్‌లో ‘ లవ్ గురు ‘ అనే ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్వయంగా ఆయన ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాను వినాయక్‌ వైద్యనాథన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈనెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో సినీ విశేషాలు షేర్ చేసుకున్నారు విజయ్. ఆయన మాట్లాడుతూ పర్సనల్ గా నేను ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించనని.. ప్రస్తుతం లో మాత్రమే జీవిస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు.

vijayantony on X: "రోగ్ romance🥃🌹 Milk and Whiskey❤ #BLOCKBUSTER this  summer🔥 #LOVEGURU @vijayantonyfilm @mirnaliniravi @actorvinayak_v  @GSKMedia_PR @AbishekJason @gobeatroute https://t.co/DSwW6aXwBW" / X

మనం ఒకటి కోరుకుని.. ఇంకొకటి దక్కితే చాలా నిరాశ పడాల్సి వస్తుందని.. మనకు ఏది కావాలో.. ఏది ఇవ్వాలో ప్రపంచం చూసుకుంటుందంటూ వివరించాడు. ఈ సినిమా విషయంలోనూ నేను అలాగే ఆలోచించానని.. కథ విన్నప్పుడు సినిమా సాధించబోయే విజయం పై నాకు నమ్మకం కలిగిందంటూ చెప్పుకొచ్చాడు. దర్శకుడు తన జీవితంలో జరిగిన అనుభవాలన్నింటినీ ఒక క‌థ‌గా మలిచాడని.. ఈ సినిమాతో మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్‌ను మీరు చూస్తారు అంటూ చెప్పుకొచ్చాడు.

Vijay Antony Look From Love Guru Out | Vijay Antony Look From Love Guru Out

సినిమా చూసిన తర్వాత మీ జీవిత భాగస్వామిని ఎలా ప్రేమించాలో మీకు అర్థమవుతుంది. నాకు మెమరీ పవర్ చాలా తక్కువ. తెలుగు భాష నేర్చుకోలేకపోయా. నాకు తెలుగు వచ్చి ఉంటే ఖచ్చితంగా చెన్నై ను వదిలేసి తెలుగులోనే సినిమాలు చేసే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు. అలాంటి అవకాశం వ‌స్తే ఇక్కడే ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ మాట్లాడుతూ ప్రస్తుతం మా ప్రొడక్షన్‌లో మూడు సినిమాలు లైన్ అప్‌లో ఉన్నాయి. బిచ్చగాడు 3.. 2026 సమ్మర్‌లో రిలీజ్ కానుంది అంటూ వివరించాడు.