పాన్ ఇండియా లెవెల్‌లో రాజమౌళిని బీట్ చేసే కెపాసిటీ ఉన్న దర్శకులు వీళ్లేనా..?!

టాలీవుడ్ లో చిన్న దర్శకుడుగా మొదలైన రాజమౌళి సినీ ప్రస్థానం ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన సంగ‌తి తెలిసిందే. తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన రాజమౌళి లాంటి దర్శకుడు మన సినీ ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం. ఎందుకంటే ఎక్కడో మొదలైన ప్రస్థానం ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి తెలుగు సినిమా స్థాయిని నిలిపే దాకా రాజమౌళి తీసుకురావ‌డం అంటే సాధార‌ణ విష‌యంకాదు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు జ‌క్క‌న‌. ఈ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నట్లు సమాచారం.

Sandeep Reddy Vanga drew inspiration from THIS movie for Animal fight scenes - Republic World

ఎందుకంటే ఈ సినిమాతో పాన్ వ‌ర‌ల్డ్‌లో తన సత్తా చాటేందుకు ఆస్కార్ అవార్డులను మరెన్నో గెలుచుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియాలో జక్కన్న బీట్ చేసే డైరెక్టర్ ఎవరు అనే వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే రాజమౌళిని బీట్ చేసే కెపాసిటీ ఉన్న దర్శకులు ఇండియాలోనే లేరు అంటూ.. ఒకవేళ ఉన్నా కూడా అది సందీప్ రెడ్డి వంగ లేదా ప్రశాంత్ నీల్‌ మాత్రమే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

KGF Director Prashanth Neel's Special Connection With Andhra Pradesh. Learn More - News18

రాజమౌళితో పోటీపడి యాక్షన్ సినిమాలు చేసే అంత కెపాసిటీ వీళ్లకు కూడా లేదు అంటూ మరికొన్ని సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రాజమౌళిని దర్శకత్వంలో బీట్‌ చేసే డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్ లో ఎవ్వరు లేరు అంటూ అభిమానుల నుంచి గట్టిగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జక్కన్న- మ‌హేష్‌ కాంబోలో నటించనున్న నటీనటులు ఎవరు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తొందరలోనే మిగతా నటీనటులను కూడా సెలెక్ట్ చేసి సెట్స్‌ పైకి సినిమాను తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు జక్కన్న. మొత్తానికి రాజమౌళి సినిమా మీద భారీ ఎఫర్ట్ పెడుతున్నట్లు సమాచారం.