ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్నాళ్లకి ఆ కోరిక తీర్చుకోబోతున్న నయనతార.. అదృష్టం అంటే ఇదేరోయ్..!

నయనతార .. ఇన్నాళ్లకు తన కోరిక తీర్చుకోబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . సౌత్ ఇండియాలోనే మోస్ట్ టాలెంటెడ్ ..మోస్ట్ క్రిస్టియన్ హీరోయిన్ నయనతార . తెలుగులో ఒక సినిమా తమిళ్లో రెండు సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ముందుకు వెళ్తుంది. దానికి కారణం ఆమెకి ఉన్న క్రేజ్.. వచ్చిన సినిమాలు అన్నీ ఓకే చేస్తే తనకున్న క్రేజ్ పాడైపోతుంది అని భావించిన నయనతార ..తన బాడీకి తగ్గ కధలనే చూస్ చేసుకుంటుందట .

రీసెంట్గా నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసే స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ సినిమాలో ఆఫర్ అందుకున్నట్లు ఓ వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . సంజయ్ లీలా భన్సాలి సినిమాలో ఆఫర్ అంటే మాటలు కాదు . దానికి ఎంతో అదృష్టం ఉండాలి . అలాంటి ఒక రేర్ కాంబో ని ఇప్పుడు మనం తెరపై చూడబోతున్నాము.. బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్లో హీరోయిన్ నయనతార జాక్ పాట్ ఛాన్స్ పట్టేసింది అంటూ కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలలో వార్తలు వినిపిస్తున్నాయి.


నిజానికి విగ్నేశ్ శివన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత నయనతార క్రేజ్ పడిపోయిందని చెప్పాలి. అంతకుముందు నయనతార అంటే పెద్ద పెద్ద హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో నయనతార అంటే ఇద్దరు ముగ్గురు హీరోలు మాత్రమే ఓటు వేస్తున్నారు . మిగతా హీరోలు అంతా వేరే హీరోయిన్ లకి ఓట్లు వేస్తున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో నయనతార కి సంబంధించిన వార్తలు ఎలాంటివి వైరల్ అయ్యాయో కూడా మనం చూసాం. ఒకానొక సందర్భంలో విగ్నేశ్ నయన్ విడిపోతున్నారు అన్న ప్రచారం కూడా జరిగింది..!!