టాలీవుడ్ లో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు పొందుతున్న హీరోయిన్లు వీళ్లే..!!

సినీ ఇండస్ట్రీలో చాలా చోట్ల హీరో హీరోయిన్లుగా క్రేజ్‌ సంపాదించుకున్న నటీ, నటులు కేవలం డబ్బులను సంపాదించడం మీదే కాదు సంపాదించిన డబ్బును ఇతరులకు సహాయం చేయడానికి కూడా వెచ్చిస్తున్నారు. సమాజానికి సేవ చేసేందుకు సొసైటీకి తమ సేవలు అందించేందుకు సహకరిస్తున్నారు. అందులో హీరోలకు వచ్చినంత రెమ్యూనరేషన్ హీరోయిన్స్‌కి రాదు. కనుక వారికి భారీగా స్పాన్సర్ చేసే.. సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండదు. అయినప్పటికీ ఆ పరిస్థితికి గుడ్ బై చెప్పేసి మరీ చాలామంది టాలీవుడ్ హీరోయిన్లు మేము కూడా సోషల్ సర్వీస్ చేస్తామంటూ నిరూపించుకుంటున్నారు. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరు.. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటో.. తెలుసుకుందాం.

Sree Leela to take a Long Break

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈ లిస్టులో మొదటి వరుసలో ఉంటుంది. ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అనాధ పిల్లలకు సహాయం చేయడమే కాదు.. సంపాదన‌లో 90% కేవలం సేవా కార్యక్రమాలకే వినియోగిస్తుంది. ఇక శృతిహాసన్ కూడా ఈ లిస్టులో ఉంది. తన తండ్రి కమలహాసన్ స్థాపించిన ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఎంతో మందికి ఆరోగ్యం, చదువు విషయంలో తోడ్పడుతుంది. ఇక టాలీవుడ్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో సెటిల్ అయినా హన్సిక కూడా భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఈమె కూడా నేను పేద పిల్లలకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటానని ప్రకటించింది.

Oru Kodi: Did you know actress Samyuktha Menon was a part of an event  management firm before her successful movie stint? - Times of India

అతి చిన్న వయసు నుంచే సేవా కార్యక్రమాలు చేస్తూ 25 మంది పిల్లలను దత్తత తీసుకొని మరి చదివిస్తోంది హ‌న్సిక‌. అంతేకాదు ఆమెకు సమయం దొరికినప్పుడల్లా వారికి ఇంగ్లీష్ మరియు లీడర్షిప్ క్వాలిటీస్ గురించి నేర్పిస్తూ విలువలు తెలియజేస్తోంది. ఇటీవల వరుస‌ సినిమాల్లో ఛాన్సులు కొట్టేసి క్రేజీ బ్యూటీగా మారిన శ్రీ‌లీల‌ కూడా అంగవైకల్యం ఉన్న పిల్లలను దత్తత తీసుకుని వారికి చదువు చెప్పిస్తుంది. ఆమె సొంతంగా ఒక సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎన్నో సోషల్ సర్వీసులు చేస్తోంది. ఇక తాజాగా ఈ లిస్టులో సంయుక్తమీనన్‌ కూడా చేరింది. శ్రీ శక్తి సేవ అనే ఒక సంస్థను ప్రారంభించి మహిళలకు, పిల్లలకు కావలసిన అన్ని సహయ‌ సహకారాలు అందించడానికి సిద్ధమైంది సంయుక్త. ఇలా ఈ హీరోయిన్స్ అంతా సేవ కోసం తమ డబ్బును ఖర్చు చేసి ప్రజల ప్ర‌శంస‌లు పొందుతున్నారు.