ఛీ.. ఛీ.. మ‌రీ ఇంత దారుణ‌మా.. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ అలాంటి రోల్‌లో అనుష్క‌.. ఫ్యాన్స్ త‌ట్టుకోగ‌ల‌రా..?

తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్కకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట నాగార్జున సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి త‌న అందం అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది. ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోయింది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన‌ నటించిన అనుష్క.. ప్రభాస్ తో నటించిన మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలి, బాహుబలి 2 సిరీస్ లతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. వీరిద్దరి కాంబోకు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పటికే అనుష్క, ప్రభాస్ ప్రేమలో ఉన్నారంటూ పలు వార్తలు వైరలైన సంగతి తెలిసిందే.

దీనిపై ఇద్దరు ఎన్నోసార్లు స్పందించి క్లారిటీ ఇచ్చిన ఆ వార్తలకు మాత్రం చెక్ పడడం లేదు. దీంతో వీరిద్దరూ ఆ వార్తలను పట్టించుకోవడం మానేసి కెరీర్ చూసుకుంటూ బిజీ అయిపోయారు. అయితే గత కొంతకాలంగా అనుష్క ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక‌ గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ఘాటీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్.. పోస్టర్ రిలీజ్ అయి మంచి హైప్‌ సంపాదించుకుంది. ఓ నిజమైన సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా అనుష్కకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఘాటి సినిమాలో అనుష్క డ్యూయల్ రోల్ లో నటించబోతుందని.. ఆమె నటిస్తున్న ఓ రోల్ యువతిగా.. మరొకటి 60 ఏళ్ల వృద్ధురాలుగా ఉంటుందని.. ఏదో సమస్యతో ఆమె జీవితం అలా మలుపు తిరిగిందని.. అసలు ఆ సమస్య నుంచి ఎలా బయటపడింది అనేది సినిమాలో ప్రధాన అంశంగా చూపించినట్లు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ఆ విషయం తెలిసిన అనుష్క ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇందులో పెద్ద రిస్క్ ఉంది. ఇలాంటి 60 ఏళ్ల వృద్ధురాలు పాత్రలో సినిమా చేయడం అవసరమా.. ఇప్పటికే జీరో సైజ్ లాంటి ఎక్స్పరిమెంట్ సినిమా వలన చాలా నష్టపోయాం. దయచేసి ఇలాంటి పాత్రలో నటించడానికి ఒప్పుకోకు స్వీటీ అంటూ.. ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా హిట్ కాకపోతే మాత్రం అనుష్కకు అవకాశాలు రావడం కష్టమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం అనుష్క నటిస్తున్న ఘాటి మూవీ యువి క్రియేషన్స్, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.