ఫ్యాన్స్ కు సూపర్ ట్విస్ట్ ఇచ్చిన ఫ్యామిలీ స్టార్.. విజయ్ దేవరకొండ పెళ్లిలో రష్మిక డ్యాన్స్..?!

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఈ జోడి కొన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రెండు సినిమాలు వచ్చి మంచి సక్సెస్ సాధించాయి. వీరిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. మేకర్స్ కూడా వీరి కాంబోలో ఒక మూవీని ప్లాన్ చేస్తున్నారు. అదిగో, ఇదిగో అనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి తప్ప ఇప్పటివరకు మరోసారి వీరిద్దరికి కాంబోలో సినిమా రాలేదు. అయితే ఇప్పుడు ఆ వార్త నిజమవుతుందంటూ తెలుస్తుంది.

వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారట. విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమాతోనే అది నిజం కాబోతుందట. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించారు మేకర్స్‌. ఇప్పటికే ఓ పాటను రిలీజ్ చేశారు. అది బాగా ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. పూర్తి పాటని ఈరోజు సాయంత్రం రిలీజ్ చేయనన్నారు. అయితే ఫ్యామిలీ స్టార్‌లో రష్మిక మందన కనిపించనుందట.

ఈ విషయం గతంలోనే ఆమె చెప్పుకొచ్చింది. ఓ పాటలో ఈమె మేరుస్తుందని రూమర్ అప్పట్లో వైరల్ అయింది. మృణాల్ ఠాగూర్‌తో పాటు రష్మిక కూడా ఈ పాటలో కనిపిస్తారట. తాజాగా ఈరోజు విడుదల కాబోతున్నాయి ఈ పాటలో నేషనల్ క్ర‌ష్ మరువనుందట. ఇందులో మృణాల్‌, విజయ్‌ల పెళ్లి సన్నివేశం చూపించనున్నారు. అందులో రష్మిక డ్యాన్స్ చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే విజయ్‌ పెళ్లిలో రష్మిక డాన్స్ చేస్తుందన్నమాట. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుత వార్త నెటింట‌ అవ్వడంతో అంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.