దేవర కోసం ఫస్ట్ టైం ఇష్టం లేని పని చేయబోతున్న ఎన్టీఆర్… ఫ్యాన్స్ కు ఊహించిన బిగ్ షాక్..!

దేవర.. ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న సినిమా . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై జనాలు ఎలాంటి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారో మనకు తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు కొరటాల శివ . ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 6 కేజీలు బరువు తగ్గాడు .

అంతేకాదు ఈ సినిమా కోసం ఆయనకు ఇష్టం లేని పని కూడా చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఒక టాటూ వేయించుకోబోతున్నాడట. సినిమాలోని మెయిన్ కాన్సెప్ట్ కోసమే ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నాడట . నిజానికి ఎన్టీఆర్కి టాటూస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు . కానీ సినిమా కథ డిమాండ్ చేయడంతో తనకు ఇష్టం లేకపోయినా సరే టాటూ వేయించుకోవడానికి ఓకే చెప్పారట.

ఫేక్ టాటూస్ వేయించుకుని సినిమాను తక్కువ చేయడం ఇష్టం లేకనే ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టు వైరల్ గా మారింది. ఎన్టీఆర్ చాలా మొండోడు.. అనుకున్నది సాధిస్తాడు.. ఆ విషయం అందరికీ తెలిసిందే . సినిమాల విషయంలో మరింత కఠినంగా ఉంటాడు . మరి స్క్రిప్ట్ గా కూడా ఉంటాడు . అందుకే ఆయనంటే అందరికీ అంత ఇష్టం . చూద్దాం మరి దేవర సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?